విండీస్..విజయంతో ముగించింది
ABN , Publish Date - Feb 20 , 2026 | 04:05 AM
వరల్డ్ కప్‌లో వెస్టిండీస్ తన ఆఖరి గ్రూప్ మ్యాచ్‌లోనూ విజయం సాధించి అజేయంగా నిలిచింది. కెప్టెన్ షాయ్ హోప్ (46 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 75) అదరగొట్టడంతో...
42 పరుగులతో ఇటలీ పరాజయం
కోల్‌కతా: వరల్డ్ కప్‌లో వెస్టిండీస్ తన ఆఖరి గ్రూప్ మ్యాచ్‌లోనూ విజయం సాధించి అజేయంగా నిలిచింది. కెప్టెన్ షాయ్ హోప్ (46 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 75) అదరగొట్టడంతో గురువారం జరిగిన గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో 42 పరుగులతో ఇటలీని ఓడించింది. తొలుత వెస్టిండీస్ 20 ఓవర్లలో 165/6 స్కోరు చేసింది. 31 పరుగులకే రెండు వికెట్లు కోల్పోగా చేజ్ (24)తో కలిసి హోప్ మూడో వికెట్‌కు 64 పరుగులు జోడించాడు. అనంతరం రూఽథర్‌ఫోర్డ్ (24 నాటౌట్), ఫోర్డ్ (16 నాటౌట్) ఏడో వికెట్‌కు 14 బంతుల్లో అభేద్యంగా 28 పరుగులు జత చేశారు. కలుగమగే, మనెంటి చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఛేదనలో విండీస్ బౌలర్ల ధాటికి ఇటలీ 18 ఓవర్లలో 123 పరుగులకే ఆలౌటైంది. బెన్ మనెంటి (26) టాప్ స్కోరర్. స్మట్స్ (24), మోస్కా (19) పర్లేదనిపించారు. జోసెఫ్ నాలుగు, ఫోర్డు మూడు, మోటీ రెండు వికెట్లు సాధించారు. హోప్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు.
సంక్షిప్త స్కోర్లు
వెస్టిండీస్ : 20 ఓవర్లలో 165/6 (షాయ్ హోప్ 75, రూథర్‌ఫోర్డ్ 24 నాటౌట్, రోస్టన్ చేజ్ 24, కలుగమగే 2/25, బెన్ మనెంటి 2/37);
ఇటలీ: 18 ఓవర్లలో 123 ఆ లౌట్ (మనెంటి 26, షమార్ జోసెఫ్ 4/30, ఫోర్డ్ 3/19, మోటీ 2/24).
ఇవి కూడా చదవండి..
బిల్‌గేట్స్ AI సమ్మిట్ ప్రసంగం: ఉత్కంఠకు తెర.. స్పష్టతనిచ్చిన ఫౌండేషన్!
సర్వజన క్షేమానికి పరిష్కారాలు కనుగొందాం