Share News

నబీ సంచలనం

ABN , Publish Date - Feb 20 , 2026 | 03:51 AM

టీ20 వరల్డ్‌క్‌పలో అఫ్ఘానిస్థాన్‌ తమ ప్రస్థానాన్ని విజయంతో ముగించింది. ఓపెనర్‌ ఇబ్రహీం జద్రాన్‌ (56 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 95 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌కు తోడు.. వెటరన్‌ స్పిన్నర్‌ నబీ (4/7) సంచలన...

నబీ సంచలనం

7 పరుగులకే 4 వికెట్లు

కెనడాపై అఫ్ఘాన్‌ గెలుపు

టీ20 వరల్డ్‌కప్‌

చెన్నై: టీ20 వరల్డ్‌క్‌పలో అఫ్ఘానిస్థాన్‌ తమ ప్రస్థానాన్ని విజయంతో ముగించింది. ఓపెనర్‌ ఇబ్రహీం జద్రాన్‌ (56 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 95 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌కు తోడు.. వెటరన్‌ స్పిన్నర్‌ నబీ (4/7) సంచలన బౌలింగ్‌తో కట్టడి చేశాడు. దీంతో గ్రూప్‌ ‘డి’లో కెనడాతో జరిగిన నామమాత్రపు మ్యాచ్‌లో అఫ్ఘాన్‌ 82 రన్స్‌ తేడాతో నెగ్గింది. 2024 టోర్నీలో ఈ జట్టు సెమీ్‌సకు చేరిన విషయం తెలిసిందే. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన అఫ్ఘాన్‌ 20 ఓవర్లలో 200/4 స్కోరు చేసింది. సెదికుల్లా అటల్‌ (44), ఓపెనర్‌ గుర్బాజ్‌ (30) రాణించారు. జస్కరణ్‌ సింగ్‌కు మూడు వికెట్లు లభించాయి. ఆ తర్వాత భారీ ఛేదనలో స్పిన్నర్‌ నబీ కెరీర్‌ బెస్ట్‌ బౌలింగ్‌తో కెనడాను కుదురుకోనీయలేదు. ఫలితంగా ఆ జట్టు 20 ఓవర్లలో 118/8 స్కోరుకే పరిమితమై చిత్తుగా ఓడింది. హర్ష్‌ (30), సాద్‌ బిన్‌ (28) ఫర్వాలేదనిపించారు. రషీద్‌కు రెండు వికెట్లు దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా జద్రాన్‌ నిలిచాడు.

సంక్షిప్త స్కోర్లు

అఫ్ఘానిస్థాన్‌: 20 ఓవర్లలో 200/4 (జద్రాన్‌ 95 నాటౌట్‌, సెదికుల్లా 44, జస్కరణ్‌ 3/52);

కెనడా: 20 ఓవర్లలో 118/8(హర్ష్‌ 30, నబీ 4/7, రషీద్‌ 2/19)

ఇవి కూడా చదవండి..

బిల్‌గేట్స్ AI సమ్మిట్ ప్రసంగం: ఉత్కంఠకు తెర.. స్పష్టతనిచ్చిన ఫౌండేషన్!

సర్వజన క్షేమానికి పరిష్కారాలు కనుగొందాం

Updated Date - Feb 20 , 2026 | 03:51 AM