విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా అరుణాచల్ ప్రదేశ్-బిహార్ జట్లు తలపడుతున్నాయి. నిర్ణీత 50 ఓవర్లలో బిహార్ జట్టు ఆరు వికెట్లు కోల్పోయి ఏకంగా 574 పరుగులు చేసింది. ఇందులో ముగ్గురు సెంచరీలతో చెలరేగగా.. ఒకరు హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.
విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా ముంబైతో జరుగుతున్న మ్యాచులో సిక్కిం 7 వికెట్లు కోల్పోయి 236 పరుగులు చేసింది. ముంబైకి 237 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. వరుస హాఫ్ సెంచరీలతో మంచి ఫామ్‌లో ఉన్న రోహిత్ శర్మ.. ముంబై తరఫున ఎలా ఆడతాడో చూడాలి.
వైభవ్ సూర్యవంశీ.. క్రికెట్ అభిమానులు ఇప్పుడు ఈ పేరునే జపిస్తున్నారు. విజయ్ హజారే ట్రోఫీలో ఏకంగా రెండు ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టాడు. 36 బంతుల్లోనే సెంచరీ బాదాడు. అంతటితో ఆగలేదు.. 84 బంతుల్లోనే 150 పరుగలు చేసి ఏబీడీ రికార్డును బ్రేక్ చేశాడు.
యాషెస్ సిరీస్ మ్యాచ్‌ల మధ్యలో విరామం సమయంలో ఇంగ్లండ్ ఆటగాళ్లు మద్యం మత్తులో తూగుతూ కనిపించిన వీడియోలు సంచలనం రేపాయి. దీనిపై ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్.. ఈ విషయంపై మౌనం వీడారు. ఏది జరిగినా ఆటగాళ్ల వెనక నిలబడతానని స్పష్టం చేశారు.
వచ్చే ఏడాది భారత్ తో జరగనున్న పరిమిత ఓవర్ల సిరీసులకు న్యూజిలాండ్ తమ జట్లను ప్రకటించింది. టీ20, వన్డే జట్లకు ఇద్దరు కెప్టెన్లను కివీస్ సెలక్టర్లు ప్రకటించారు. గాయం కారణంగా కీలక ప్లేయర్లు ఈ సిరీసులకు దూరం అయ్యారు.
విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా బిహార్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సెంచరీల సంచలనం వైభవ్ సూర్యవంశీ అదరగొడుతున్నాడు. 36 బంతుల్లోనే సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు. తృటిలో డబుల్ సెంచరీ మిస్ చేసుకుని పెవిలియన్ చేరాడు.
టీ20 ప్రపంచ కప్ 2026 సమీపిస్తున్న నేపథ్యంలో భారత మహిళా క్రికెట్ జట్టు సన్నాహక మ్యాచులు ఆడుతుంది. శ్రీలంకతో టీ20 సిరీస్‌లో భాగంగా తొలి రెండు మ్యాచుల్లో గెలిచింది. కానీ ఫీల్డింగ్‌లో ఇంకా మెరుగవ్వాల్సిన అవసరం ఉంది.
ఇటీవలే టీ20 ప్రపంచ కప్ 2026కి సంబంధించిన టీమిండియా జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. స్టార్ ప్లేయర్లు సూర్య కుమార్ యాదవ్, గిల్ ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో.. గిల్‌పై వేటు పడింది. సూర్యను ఎందుకు తప్పించలేదనే వాదన మొదలైంది. దీనిపై మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప స్పందించాడు.
విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా తొలి మ్యాచ్‌లో ఢిల్లీ-ఆంధ్ర జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఢిల్లీ.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ఆంధ్ర జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది.
నేటి నుంచి దేశవాళీ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో ఢిల్లీ-ఆంధ్ర తలపడుతున్నాయి. అయితే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి స్టార్లు ఆడుతుండటంతో దీనిపై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో రో-కో ఈ మ్యాచులకు ఎంత పారితోషికం తీసుకుంటారనే దానిపై చర్చ నడుస్తుంది.