Share News

బరిలో శ్రీకాంత్‌, తన్వీ

ABN , Publish Date - Feb 24 , 2026 | 01:38 AM

జర్మన్‌ ఓపెన్‌ సూపర్‌ 300 బ్యాడ్మింటన్‌ టోర్నీ మంగళవారం ఇక్కడ ప్రారంభం కానుంది. వెటరన్‌ షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్‌, ప్రపంచ జూనియర్‌ చాంపియన్‌షి్‌ప్స రజత పతక విజేత తన్వీశర్మ ఈ...

బరిలో శ్రీకాంత్‌, తన్వీ

నేటి నుంచి జర్మన్‌ ఓపెన్‌

మ్యూహెమ్‌ అండర్‌ హువా (జర్మనీ): జర్మన్‌ ఓపెన్‌ సూపర్‌ 300 బ్యాడ్మింటన్‌ టోర్నీ మంగళవారం ఇక్కడ ప్రారంభం కానుంది. వెటరన్‌ షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్‌, ప్రపంచ జూనియర్‌ చాంపియన్‌షి్‌ప్స రజత పతక విజేత తన్వీశర్మ ఈ టోర్నమెంట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రపంచ మాజీ నెంబర్‌ వన్‌ శ్రీకాంత్‌ గత సీజన్‌లో నిలకడైన ప్రదర్శన చేశాడు. తద్వారా మలేసియా మాస్టర్స్‌ సూపర్‌ 500, సయ్యద్‌ మోదీ సూపర్‌ 300 టోర్నీలలో రన్నర్‌పగా నిలిచాడు. మహిళల సింగిల్స్‌లో 16 ఏళ్ల తన్వీ మలేసియాకు చెందిన వాంగ్‌ లింగ్‌ చింగ్‌తో మ్యాచ్‌ ద్వారా టోర్నీని ఆరంభించనుంది. ఏడాదిగా నిలకడగా రాణిస్తున్న తన్వీ శర్మ గువాహటి, యూఎస్‌ ఓపెన్‌లలో రన్నర్‌పగా నిలిచి భళా అనిపించుకుంది. మాళవికా బన్సోడ్‌ మొదటి రౌండ్‌లో లినె మార్క్‌ (డెన్మార్క్‌)ను ఢీకొంటుంది. పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్‌తోపాటు కిరణ్‌ జార్జ్‌, తరుణ్‌ మన్నేపల్లి, మహిళల డబుల్స్‌లో అశ్వినీ భట్‌/శిఖా గౌతమ్‌ పోటీపడుతున్నారు.

ఇవి కూడా చదవండి..

పాపం.. స్నేహితుడికి సాయం చేయాలనుకున్నాడు.. రూ.7 కోట్ల స్కామ్‌లో ఇరుక్కున్నాడు..

Updated Date - Feb 24 , 2026 | 01:38 AM