సంచలనం సృష్టిస్తారా..?
ABN , Publish Date - Feb 24 , 2026 | 01:35 AM
ప్రతిష్ఠాత్మక రంజీట్రోఫీ ఫైనల్లోకి తొలిసారి అడుగుపెట్టిన జమ్మూ కశ్మీర్ జట్టు మంగళవారం నుంచి జరిగే పోరులో కర్ణాటకతో తలపడుతోంది. కర్ణాటకకు ఎదురొడ్డి నిలిచి టైటిల్...
కర్ణాటకతో జమ్మూ కశ్మీర్ రంజీ ఫైనల్ నేటినుంచి
హుబ్బళ్లి: ప్రతిష్ఠాత్మక రంజీట్రోఫీ ఫైనల్లోకి తొలిసారి అడుగుపెట్టిన జమ్మూ కశ్మీర్ జట్టు మంగళవారం నుంచి జరిగే పోరులో కర్ణాటకతో తలపడుతోంది. కర్ణాటకకు ఎదురొడ్డి నిలిచి టైటిల్ అందుకోవాలంటే జమ్మూ కశ్మీర్ అద్భుతంగా ఆడాల్సిందే. ఎనిమిదిసార్లు చాంపియన్ కర్ణాటక ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, కెప్టెన్ దేవ్‌దత్ పడిక్కళ్, స్మరణ్‌లతో కర్ణాటక బ్యాటింగ్ దుర్భేద్యంగా ఉంది. పేసర్ అకీబ్ నబీ ఆధ్వర్యంలోని కశ్మీర్ బౌలింగ్ విభాగం వారిని ఎలా అడ్డుకుంటుందో చూడాలి. ఈ సీజన్‌లో 55 వికెట్లు తీసిన నబీనే జమ్మూ కశ్మీర్ ప్రధాన బౌలింగ్ ఆయుధం. ఇక..భారత జట్టు పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ, కావేరప్ప, విద్యాధర్, వైశాఖ్, మొహిసిన్ ఖాన్, శ్రేయాస్ గోపాల్‌తో కర్ణాటక బౌలింగ్ ప్రత్యర్థుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. అలాంటి జట్టును పరాస్ డోగ్రా సారథ్యంలోని జమ్మూ కశ్మీర్ ఎలా నిలువరిస్తుందనేది ఆసక్తికరం.
ఇవి కూడా చదవండి..
పాపం.. స్నేహితుడికి సాయం చేయాలనుకున్నాడు.. రూ.7 కోట్ల స్కామ్‌లో ఇరుక్కున్నాడు..