గెలుపే కాదు అంతకుమించి..
ABN , Publish Date - Feb 24 , 2026 | 01:51 AM
టీ20 వరల్డ్‌క్‌పలో దూసుకెళ్తున్న టీమిండియాకు ఒక్క ఓటమి కళ్లెం వేసింది. గ్రూప్ దశలో అజేయ ఆటతీరును ప్రదర్శించినా.. కీలక సూపర్-8 ఆరంభ పోరులో సఫారీల దెబ్బకు భారత్ సెమీస్ బెర్త్ క్లిష్టంగా మారింది...
(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)
భారత్‌కు క్లిష్టంగా మారిన సెమీస్ అవకాశాలు
టీ20 వరల్డ్‌క్‌పలో దూసుకెళ్తున్న టీమిండియాకు ఒక్క ఓటమి కళ్లెం వేసింది. గ్రూప్ దశలో అజేయ ఆటతీరును ప్రదర్శించినా.. కీలక సూపర్-8 ఆరంభ పోరులో సఫారీల దెబ్బకు భారత్ సెమీస్ బెర్త్ క్లిష్టంగా మారింది. ఎందుకంటే.. ఈ మ్యాచ్‌లో 76 పరుగుల తేడాతో ఓటమి భారత్‌ను రన్‌రేట్ పరంగా దారుణంగా దెబ్బతీసింది. 188 పరుగుల ఛేదనలో మనోళ్లు చేసింది 111 పరుగులే కావడంతో ప్రస్తుతం గ్రూప్ 1లో భారత్ నెట్‌రన్‌రేట్ -3.800తో దయనీయంగా ఉంది. దీంతో జింబాబ్వే, వెస్టిండీ్‌సతో మిగిలిన మ్యాచ్‌లను కచ్చితంగా గెలిచి తీరాల్సిన పరిస్థితి నెలకొంది. అయినా కూడా సెమీస్ అవకాశాలు అంత సులువేమీ కాదు. మున్ముందు భారత జట్టు ఎలా ఆడాలనే విషయం పరిశీలిస్తే..
రెండు మ్యాచ్‌లూ గెలిస్తే..
సూపర్-8లో భారత్‌కు మిగిలిన రెండు మ్యాచ్‌లను గెలిస్తే నాలుగు పాయింట్లు లభిస్తాయి. సెమీ్‌సకు వెళ్లేందుకు ఈ ఫలితాలు సరిపోతాయి. కానీ ఇందుకు దక్షిణాఫ్రికా కూడా సహాయపడాల్సి ఉంటుంది. ఆ జట్టు కచ్చితంగా తమ రెండు మ్యాచ్‌ల్లోనూ గెలవాల్సి ఉంటుంది. అలాగైతేనే.. సఫారీలు ఆరు, భారత్ నాలుగు పాయింట్లతో సెమీస్‌కు వెళతాయి.
పాయింట్లు సమానంగా ఉంటే..
పరిస్థితులు సవ్యంగా సాగకుండా.. భారత్ రెండు మ్యాచ్‌లు గెలిచి, వెస్టిండీస్ జట్టు సౌతాఫ్రికాకు షాకిస్తే మాత్రం సీన్ మారుతుంది. అప్పుడు భారత్, సౌతాఫ్రికా, విండీస్ కూడా నాలుగేసి పాయింట్లతో ఉంటాయి. ఆ సమయంలో నెట్ రన్‌రేట్ అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. జింబాబ్వేపై విండీస్ 107 రన్స్ తేడాతో గెలవడంతో వారి రన్‌రేట్ +5.350తో ఆకాశాన ఉంది. అందుకే భారత్ రెండు మ్యాచ్‌లను అలాఇలా గెలిస్తే సరిపోదు.. భారీ తేడాతో ప్రత్యర్థులను మట్టికరిపించాల్సి ఉంది.
భారత్
ఒక్క మ్యాచే గెలిస్తే..
ఒకవేళ భారత జట్టు గురువారం జింబాబ్వే చేతిలో ఓడితే పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతుంది. ఈ సందర్భంలో దక్షిణాఫ్రికా తమ రెండు మ్యాచ్‌లను కచ్చితంగా గెలవాలి. అలాగే టీమిండియా చివరి మ్యాచ్‌లో విండీ్‌సను భారీ తేడాతో ఓడించాల్సి ఉంటుంది. అలా జరిగితే భారత్, వెస్టిండీస్, జింబాబ్వే ఖాతాలో రెండేసి పాయింట్లు ఉంటాయి. ఈ సమయంలో కూడా మెరుగైన నెట్‌రన్‌రేట్‌ను కలిగిన జట్టే సెమీఫైనల్‌కు దూసుకెళుతుంది.
ఇవి కూడా చదవండి..
పాపం.. స్నేహితుడికి సాయం చేయాలనుకున్నాడు.. రూ.7 కోట్ల స్కామ్‌లో ఇరుక్కున్నాడు..