Share News

విండీస్‌ వీరవిహారం

ABN , Publish Date - Feb 24 , 2026 | 01:56 AM

ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టిన కరీబియన్లు.. టీ20 వరల్డ్‌కప్‌ సూపర్‌-8లో ఘన విజయాన్ని నమోదు చేశారు. షిమ్రన్‌ హెట్‌మయెర్‌ (34 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్స్‌లతో 85) సుడిగాలి అర్ధ శతకంతోపాటు స్పిన్నర్‌ గుడకేష్‌ మోటీ (4/28) తిప్పేయడంతో....

విండీస్‌  వీరవిహారం

  • 107 పరుగులతో జింబాబ్వే చిత్తు

  • టీ20 వరల్డ్‌కప్‌ సూపర్‌-8 పోరు

దంచేసిన హెట్‌మయెర్‌, పావెల్‌

పడగొట్టిన గుడకేష్‌, అకిల్‌

ముంబై: ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టిన కరీబియన్లు.. టీ20 వరల్డ్‌కప్‌ సూపర్‌-8లో ఘన విజయాన్ని నమోదు చేశారు. షిమ్రన్‌ హెట్‌మయెర్‌ (34 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్స్‌లతో 85) సుడిగాలి అర్ధ శతకంతోపాటు స్పిన్నర్‌ గుడకేష్‌ మోటీ (4/28) తిప్పేయడంతో.. సోమవారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌ 107 పరుగుల తేడాతో జింబాబ్వేను మట్టికరిపించింది. తొలుత విండీస్‌ 20 ఓవర్లలో 254/6 స్కోరు చేసింది. ఈ టోర్నీలో ఇదే అత్యధికం. రోవ్‌మన్‌ పావెల్‌ (59), రూథర్‌ఫోర్డ్‌ (31 నాటౌట్‌) సత్తా చాటారు. ముజరబాని, ఎన్‌గరవ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఛేదనలో జింబాబ్వే 17.4 ఓవర్లలో 147 పరుగులకే కుప్పకూలింది. బ్రాడ్‌ ఇవాన్స్‌ (43), డియాన్‌ మేయర్స్‌ (28), సికందర్‌ రజా (27) ఫర్వాలేదనిపించారు. అకిల్‌ హొస్సేన్‌ 3 వికెట్లు తీశాడు. హెట్‌మయెర్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు.

బాదుడే.. బాదుడు

హెట్‌మయెర్‌ ఊచకోత మ్యాచ్‌కే హైలైట్‌. పావెల్‌తో కలసి షిమ్రన్‌ మూడో వికెట్‌కు 122 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో.. విండీస్‌ భారీస్కోరు చేసింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌.. ఓపెనర్లు కింగ్‌ (9), కెప్టెన్‌ షాయ్‌ హోప్‌ (14) వికెట్లను స్వల్ప స్కోర్లకే కోల్పోయింది. అయితే, వన్‌డౌన్‌లో వచ్చిన హెట్‌మయెర్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 9 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ముజరబాని బౌలింగ్‌లో ముసేకివా క్యాచ్‌ను చేజార్చడంతో బతికిపోయిన హెట్‌మయెర్‌.. జింబాబ్వే బౌలర్ల భరతం పట్టాడు. మరో ఎండ్‌లో పావెల్‌ చక్కని సహకారం అందించడంతో స్కోరు బోర్డు రాకెట్‌ వేగంతో దూసుకెళ్లింది. ఎడాపెడా సిక్స్‌లు బాదిన హెట్‌మయెర్‌ 19 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకొన్నాడు. దీంతో విండీస్‌ 10 ఓవర్లలో 115/2తో నిలిచింది. అనంతరం పావెల్‌ కూడా షిమ్రన్‌తో పోటీపడి షాట్లు ఆడాడు. కాగా, 15వ ఓవర్‌లో సింగిల్‌తో పావెల్‌ ఫిఫ్టీ పూర్తి చేసుకొన్నా.. హెట్‌మయెర్‌ను క్రీమర్‌ అవుట్‌ చేసి జట్టుకు ఊరటనిచ్చాడు. పావెల్‌ను ముజరబాని వెనక్కి పంపాడు. ఆఖర్లో రూథర్‌ఫోర్డ్‌, షెఫర్డ్‌ (21), హోల్డర్‌ (13) భారీ షాట్లతో చెలరేగడంతో.. టీమ్‌ స్కోరు 250 మార్క్‌ దాటింది.


సంక్షిప్త స్కోర్లు

వెస్టిండీస్‌: 20 ఓవర్లలో 254/6 (హెట్‌మయెర్‌ 85, పావెల్‌ 59; ముజరబాని 2/42, ఎన్‌గరవ 2/47).

జింబాబ్వే: 17.4 ఓవర్లలో 147 ఆలౌట్‌ (ఇవాన్స్‌ 43, మేయర్స్‌ 28; గుడకేష్‌ 4/28, అకిల్‌ 3/28, మాథ్యూ ఫోర్డె 2/27).

1

టీ20 వరల్డ్‌క్‌పలో ఈ మ్యాచ్‌లో అత్యధికంగా 31 సిక్స్‌లు నమోదయ్యాయి. 2014లో నెదర్లాండ్స్‌-ఐర్లాండ్‌ మ్యాచ్‌లో 30 సిక్స్‌ల రికార్డు బద్దలైంది.

1

పొట్టిక్‌పలో ఓ ఇన్నింగ్స్‌లో అత్యధికంగా 19 సిక్స్‌లు బాదిన నెదర్లాండ్స్‌ (2014లో ఐర్లాండ్‌పై) రికార్డును సమం చేసిన విండీస్‌.

2

వెస్టిండీస్‌ సాధించిన 254 పరుగుల స్కోరు.. టీ20 వరల్డ్‌కప్‌ చరిత్రలో రెండో అత్యధికం. 2007 టోర్నీలో కెన్యాపై శ్రీలంక 260/6 చేసింది.

పాయింట్ల పట్టిక

గ్రూప్‌-1

జట్టు మ్యా గె ఓ ర పా ర.రే

వెస్టిండీస్‌ 1 1 0 0 2 5.350

దక్షిణాఫ్రికా 1 1 0 0 2 3.800

భారత్‌ 1 0 1 0 0 -3.800

జింబాబ్వే 1 0 1 0 0 -5.350

గ్రూప్‌-2

జట్టు మ్యా గె ఓ ర పా ర.రే

ఇంగ్లండ్‌ 1 1 0 0 2 2.550

న్యూజిలాండ్‌ 1 0 0 1 1 0.000

పాకిస్థాన్‌ 1 0 0 1 1 0.000

శ్రీలంక 1 0 1 0 0 -2.550

మ్యా: మ్యాచ్‌లు; గె: గెలుపు; ఓ: ఓటమి;

ర: రద్దు; పా: పాయింట్లు; ర.రే: రన్‌రేట్‌

టీ20 ప్రపంచక్‌పలో టాప్‌-5 స్కోర్లు

ఎవరు ఎంత ఎవరిపై ఎప్పుడు

శ్రీలంక 260/6 కెన్యాపై 2007

వెస్టిండీస్‌ 254/6 జింబాబ్వేపై 2026

ఐర్లాండ్‌ 235/5 ఒమన్‌పై 2026

ఇంగ్లండ్‌ 230/8 దక్షిణాఫ్రికాపై 2016

దక్షిణాఫ్రికా 229/4 ఇంగ్లండ్‌పై 2016

ఇవి కూడా చదవండి..

పాపం.. స్నేహితుడికి సాయం చేయాలనుకున్నాడు.. రూ.7 కోట్ల స్కామ్‌లో ఇరుక్కున్నాడు..

Updated Date - Feb 24 , 2026 | 01:57 AM