ఓడినా.. ప్రపంచ రికార్డు సృష్టించిన జింబాబ్వే ప్లేయర్లు
ABN , Publish Date - Feb 24 , 2026 | 10:33 AM
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా నిన్న జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో జింబాబ్వేపై వెస్టిండీస్ 107 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే ఓడినా.. ఆ జట్టు ప్లేయర్లు అరుదైన రికార్డును క్రియేట్ చేశారు.
స్పోర్ట్స్ డెస్క్: టీ20 ప్రపంచకప్(T20 World Cup 2026)లో భాగంగా నిన్న(సోమవారం) జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో జింబాబ్వేపై వెస్టిండీస్ 107 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ విధ్వంసం సృష్టించింది. నిర్ణీత 20 ఓవర్లలో 254 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. అనంతరం.. కొండంత లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే.. ఏ దశలోనూ గెలుపు దిశగా పయనించలేదు.
కేవలం ఓటమి అంతరం తగ్గించుకునే ప్రయత్నం జరిగింది. అయినా 107 పరుగుల భారీ తేడాతో జింబాబ్వే(Zimbabwe) పరాజయం పాలైంది. ఇక ఈ మ్యాచ్‌లో జింబాబ్వే ఓడినా.. ఆ జట్టు ఆటగాళ్లు ఓ రికార్డును సాధించారు. ఓటమి ఖరారైనప్పటికీ.. జింబాంబ్వే ఆటగాళ్లు బ్రాడ్ ఎవాన్స్, రిచర్డ్ ఎంగరవ పదో వికెట్‌కు 44 పరుగులు జోడించారు. ప్రపంచకప్ చరిత్రలో చివరి వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జోడీగా వీరు రికార్డ్ క్రియేట్ చేశారు. ఇన్నింగ్స్ చివర్లో సిక్సర్లతో విరుచుకుపడ్డారు. ఎంగరవ ఒకటి, ఎవాన్స్ ఐదు సిక్సులతో చెలరేగి ఆడారు. షమార్ జోసెఫ్ వేసిన 17వ ఓవర్‌లో ఎవాన్స్ మూడు సిక్సర్లు బాదాడు.
అంతకముందు.. జేసన్ హోల్డర్ వేసిన 16వ ఓవర్‌లోనూ రెండు సిక్సర్లు కొట్టాడు ఎవాన్స్. దీనికి ముందు ఓవర్ చివరి బంతికి ఎంగరవ ఓ సిక్సర్ అందుకున్నాడు. అలానే ఈ మ్యాచ్‌లో మరో ప్రపంచకప్ రికార్డు కూడా నమోదైంది. ఇరు జట్లు కలిపి ఏకంగా 31 సిక్సర్లు(Record Sixes) కొట్టాయి. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఓ మ్యాచ్‌లో నమోదైన అత్యధిక సిక్సర్లు ఇవే కావడం గమన్హారం. గతంలో ఈ రికార్డు 2014 ప్రపంచకప్‌లో జరిగిన నెదర్లాండ్స్, ఐర్లాండ్(Ireland) మ్యాచ్(30) పేరిట ఉండేది. తాజాగా ఆ రికార్డు కేవలం ఒక సిక్సర్‌తో బ్రేక్ అయింది.
ఇవి కూడా చదవండి:
2026 ఫిఫా వరల్డ్ కప్: మెక్సికోలో హింస.. మ్యాచ్‌ల వేదికల మార్పు తప్పదా?