Share News

స్పిన్నర్లే ఆయుధంగా..

ABN , Publish Date - Feb 24 , 2026 | 01:43 AM

టీ20 వరల్డ్‌కప్‌ సూపర్‌-8 గ్రూప్‌ 2లో మంగళవారం ఇంగ్లండ్‌, పాకిస్థాన్‌ బరిలోకి దిగనున్నాయి. ఇప్పటికే ఇంగ్లండ్‌ తొలి మ్యాచ్‌లో ఆతిథ్య శ్రీలంకను 51 పరుగుల తేడాతో చిత్తు చేసి రెండు పాయింట్లు దక్కించుకుంది...

స్పిన్నర్లే ఆయుధంగా..

రాత్రి 7 గం. నుంచి

స్టార్‌స్పోర్ట్స్‌లో..

నేడు ఇంగ్లండ్‌తో పాక్‌ పోరు

పల్లెకెలె: టీ20 వరల్డ్‌కప్‌ సూపర్‌-8 గ్రూప్‌ 2లో మంగళవారం ఇంగ్లండ్‌, పాకిస్థాన్‌ బరిలోకి దిగనున్నాయి. ఇప్పటికే ఇంగ్లండ్‌ తొలి మ్యాచ్‌లో ఆతిథ్య శ్రీలంకను 51 పరుగుల తేడాతో చిత్తు చేసి రెండు పాయింట్లు దక్కించుకుంది. అయితే పాక్‌ జట్టు మాత్రం కివీ్‌సతో మ్యాచ్‌ రద్దు కారణంగా ఒక పాయింట్‌ లభించింది. దీంతో ఈ మ్యాచ్‌ గెలవడం పాక్‌కు మరింత కీలకం కానుంది. మరోవైపు ఇరుజట్లూ స్పిన్నర్లపై అధికంగా ఆధారపడ్డాయి. ఇక్కడి పిచ్‌ కూడా స్పిన్‌ను అనుకూలించనుండడంతో మ్యాచ్‌ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. ఇంగ్లండ్‌ తమ స్పిన్నర్ల ప్రతిభ కారణంగానే శ్రీలంకపై 146 పరుగులను కాపాడుకుని, ప్రత్యర్థిని 95 పరుగులకే పరిమితం చేయగలిగింది. స్పిన్నర్లు విల్‌ జాక్స్‌, రషీద్‌, డాసన్‌లకే ఏడు వికెట్లు దక్కడం విశేషం. జాక్స్‌ అటు బ్యాటింగ్‌లోనూ చెలరేగుతున్నాడు. ఓపెనర్‌ ఫిల్‌ సాల్ట్‌ ఫామ్‌లోకి రావడం లాభించనుంది. పాక్‌ సైతం నాణ్యమైన స్పిన్నర్లతో సవాల్‌ విసరేందుకు సిద్ధమైంది. మిస్టరీ స్పిన్నర్‌ ఉస్మాన్‌ తారిఖ్‌, సయీమ్‌ అయూబ్‌, ఎబ్రార్‌ అహ్మద్‌, షాదాబ్‌, నవాజ్‌లే కాకుండా కెప్టెన్‌ సల్మాన్‌ పార్ట్‌టైమ్‌ బౌలర్‌గా రాణించగలడు. కానీ బ్యాటింగ్‌లో నిలకడలేమి పాక్‌ను ఆందోళనపరిచే అంశం. ముఖ్యంగా స్పిన్‌ను ఎదుర్కోవడంలో బ్యాటర్లు తడబడుతున్నారు. టోర్నీ టాప్‌ స్కోరర్‌ సాహిబ్‌జాదా శుభారంభంపై జట్టు ఆధారపడి ఉంది.

ఇవి కూడా చదవండి..

పాపం.. స్నేహితుడికి సాయం చేయాలనుకున్నాడు.. రూ.7 కోట్ల స్కామ్‌లో ఇరుక్కున్నాడు..

Updated Date - Feb 24 , 2026 | 01:43 AM