వన్డేలూ కొట్టేస్తారా?
ABN , Publish Date - Feb 24 , 2026 | 01:41 AM
ఆస్ట్రేలియా పర్యటనలో విశేషంగా రాణిస్తోన్న భారత మహిళల క్రికెట్ జట్టు ఇక మూడు వన్డేల సిరీ్‌సపై కన్నేసింది. మంగళవారం ఇక్కడి గాబా మైదానంలో వరల్డ్ చాంపియన్ హర్మన్‌ప్రీత్ సేన...
ఆత్మవిశ్వాసంతో భారత మహిళలు
ఆసీ్‌సతో తొలి మ్యాచ్ నేడు
ఉ. 9.20 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో
బ్రిస్బేన్: ఆస్ట్రేలియా పర్యటనలో విశేషంగా రాణిస్తోన్న భారత మహిళల క్రికెట్ జట్టు ఇక మూడు వన్డేల సిరీ్‌సపై కన్నేసింది. మంగళవారం ఇక్కడి గాబా మైదానంలో వరల్డ్ చాంపియన్ హర్మన్‌ప్రీత్ సేన ఆసీస్‌తో తొలి వన్డే ఆడనుంది. ఇప్పటికే మూడు టీ20ల సిరీస్‌ను మనోళ్లు 2-1తో దక్కించుకున్న విషయం తెలిసిందే. అటు భారత వన్డే జట్టులో కష్వీ గౌతమ్, హర్లీన్, ప్రతీక చేరారు. స్మృతీ మంధాన, హర్మన్‌ప్రీత్, జెమీమా బ్యాటింగ్‌లో కీలకం కానున్నారు. బౌలింగ్ విభాగంలో పేసర్ రేణుకా సింగ్, స్పిన్నర్ శ్రీచరణిలపై జట్టు ఆధారపడి ఉంది. అయితే వన్డే వరల్డ్‌కప్ సెమీస్‌లో తమను ఓడించిన భారత్‌పై అలీసా హీలీ సారథ్యంలోని ఆసీస్ జట్టు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటోంది.
ఇవి కూడా చదవండి..
పాపం.. స్నేహితుడికి సాయం చేయాలనుకున్నాడు.. రూ.7 కోట్ల స్కామ్‌లో ఇరుక్కున్నాడు..