సౌతాఫ్రికా చేతిలో వైట్ వాష్ తర్వాత టీమిండియా స్టార్ బ్యాటర్ రిషభ్ పంత్.. అభిమానులకు క్షమాపణలు తెలిపాడు. అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా తాము రాణించలేదని.. ఈ ఓటమి ద్వారా గుణపాఠాలు నేర్చుకుని మరింత బలంగా తిరిగొస్తామని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టాడు.
డబ్ల్యూపీఎల్ మెగా వేలం కొనసాగుతోంది. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మను కొనుగోలు చేయడంలో పెద్ద హైడ్రామానే నడిచింది. దీప్తి కోసం ఢిల్లీ, యూపీ పోటీ పడగా.. ఆర్టీఎం కార్డ్ ద్వారా యూపీ రూ.3.20కోట్లకు సొంతం చేసుకుంది.
మహిళల ప్రీమియర్ లీగ్.. జనవరి 9 నుంచి ప్రారంభం కానున్నట్లు గురువారం బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఫిబ్రవరి 5 వరకు ఈ మెగా టోర్నీ కొనసాగనున్నట్లు తెలిపింది. మరోవైపు ఆసీస్ కెప్టెన్ అలీసా హీలీ డబ్ల్యూపీఎల్ వేలంలో అన్‌సోల్డ్ అయింది.
డబ్ల్యూపీఎల్ 2026 సంబంధించిన మెగా వేలం ఢిల్లీ వేదికగా మొదలైంది. ఈ మెగా ఆక్షన్‌ను మల్లికా సాగర్ నిర్వహిస్తున్నారు. ఈ లైవ్ అప్డేట్స్ మీ కోసం..
యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆసీస్- ఇంగ్లండ్ జట్లు పెర్త్ వేదికగా తొలి టెస్టులో తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఆసీస్ ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ ఆట కేవలం రెండు రోజుల్లోనే ముగిసింది. తాజాగా పెర్త్ పిచ్‌కు ఐసీసీ రేటింగ్ ఇచ్చింది.
మహిళల బిగ్‌బాష్ లీగ్‌కు స్టార్ బ్యాటర్ జెమీమా దూరమైనట్టు బ్రిస్బేన్ హీట్ జట్టు సీఈవో వెల్లడించారు. ఆమె స్నేహితురాలు స్మృతి మంధానకు తోడుగా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
సౌతాఫ్రికా చేతిలో టీమిండియా వైట్ వాష్‌కు గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హెడ్ కోచ్ గంభీర్‌ను ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్లు వచ్చాయి. ఈ విషయంపై తాజాగా బీసీసీఐ స్పందించింది. గంభీర్‌కు బీసీసీఐ మద్దుతుగా నిలిచింది.
భారత్ తో జరిగిన రెండో టెస్టులో సౌతాఫ్రికా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో దక్షిణాఫ్రికా అనేక రికార్డులను బద్దలు కొట్టింది.
గువాహటి నుంచి హైదరాబాద్ వెళ్లే విమానం అనివార్య కారణాల వల్ల రద్దు చేసినట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. విమానాల జాప్యంపై భారత్ క్రికెటర్ సిరాజ్ అసంతృప్తి వ్యక్తంచేసిన నేపథ్యంలో ఆ సంస్థ గురువారం వివరణ ఇచ్చింది.
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మందాన వివాహం వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె.. పలాశ్ ను ఇన్ స్టా లో అన్ ఫాలో చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలొచ్చాయి.