తన పేరుతో సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారంటూ టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఆవేదన వ్యక్తం చేశాడు. తాను ఏ మతాన్ని కించపరిచేలా ఎప్పుడూ మాట్లాడలేదని స్పష్టం చేశాడు.
37 ఏళ్ల వయసులోనూ అద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతున్న కోహ్లీ.. తన కెరీర్లోనే అత్యుత్తమ దశలో ఉన్నాడా? అంటే దక్షిణాఫ్రికా దిగ్గజం, కోహ్లీ మాజీ ఆర్సీబీ సహచరుడు ఏబీ డివిలియర్స్ మాత్రం అవుననే అంటున్నాడు.
ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా మధ్య మూడు టెస్టుల సిరీస్ జరగనున్న నేపథ్యంలో.. 2018 శాండ్ పేపర్ వివాదం వార్తల్లో నిలిచింది. తాజాగా ఈ విషయంపై ఆసీస్ ప్రస్తుత కెప్టెన్ ప్యాట్ కమిన్స్ స్పందించాడు.
భారత క్రికెట్ దిగ్గజం సౌరభ్ గంగూలీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘దాదా’ చిత్రంపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై గంగూలీ పాత్ర పోషిస్తున్న బాలీవుడ్ హీరో రాజ్‌కుమార్ రావు స్పందించారు.
క్రికెట్ చరిత్రలో ఆస్ట్రేలియాను తీవ్రంగా ఇబ్బందిపెట్టిన వివాదాల్లో 2018 శాండ్ పేపర్ ఉదంతం ఒకటి. అప్పుడు కేప్‌టౌన్ టెస్టు ప్రసార బాధ్యతలు పర్యవేక్షించిన అల్విన్ నైకర్ తాజాగా ఈ ఘటనకు సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.
కోహ్లీ కెప్టెన్సీకి సంబంధించి గతంలో జరిగిన పరిణామాలపై ఆర్సీబీ మాజీ ఆటగాడు పార్థివ్ పటేల్ సంచలన విషయాలను వెల్లడించాడు. 2019 ఐపీఎల్ సీజన్‌కు ముందు తనను కెప్టెన్సీకి సిద్ధంగా ఉండాలని చెప్పారని, అయితే ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయని తెలిపాడు.
భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య శుక్రవారం రాంచీ వేదికగా రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో రాంచీలో నిర్వహించిన ప్రాక్టీస్ సెషన్లో యువ బ్యాటర్ వైభవ్ బౌలర్లపై విరుచుకుపడుతూ భారీ షాట్లు ఆడాడు. దీంతో రెండో టీ20లో అయినా వైభవ్‌కు అవకాశం ఇస్తారా? అనే చర్చ మొదలైంది.
వరుస టీ20 విజయాల ఊపులో ఉన్న భారత క్రికెట్ జట్టు వెస్టిండీస్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో కూడా శుభారంభం చేసింది.
జపాన్‌లో జరిగే పారా ఆసియా క్రీడలకు భారత బృందం గురువారం బయల్దేరింది. అట్టహాసంగా జరిగిన వీడ్కోలు కార్యక్రమంలో భారత జెర్సీని కేంద్ర క్రీడా మంత్రి మన్సుఖ్ మాండవీయ ఆవిష్కరించారు.
ఆసియా క్రీడల్లో భారత ప్రదర్శనపై కేంద్ర క్రీడా శాఖ ఈనెల 13న సమీక్ష నిర్వహించనుంది. బ్యాడ్మింటన్, షూటింగ్, అథ్లెటిక్స్‌లో సీనియర్ ఆటగాళ్ల నిరాశాజనక ప్రదర్శనపై..