ఈ కార్యక్రమాన్ని గ్రేస్ ఫౌండేషన్ కోఆర్డినేటర్ గంగాధర్ సుంకర, తానా రీజినల్ కోఆర్డినేటర్ సుధీర్ చంద్ నరేపలుపు సమన్వయం చేశారు. న్యూజెర్సీ, పరిసర ప్రాంతాల నుంచి అనేక మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అమెరికాలోని డల్లాస్‌లో రెండు పుస్తకాల పరిచయ సభ ఘనంగా జరిగింది. ‘ఊహల కందని మొరాకో’, ‘మనమెరుగని లాటిన్ అమెరికా’ పేర్లతో నిమ్మగడ్డ శేషగిరి ఫేస్‌బుక్‌లో రాసిన కథనాలను, ప్రముఖ రచయిత దాసరి అమరేంద్ర తెలుగులోకి అనువదించారు. ఈ రెండు పుస్తకాల పరిచయ కార్యక్రమం.. డల్లాస్‌లోని సాహితీప్రియుల మధ్య నిర్వహించారు.
మాతృభూమికి దూరంగా విదేశాల్లో ఉంటూ తమ సంస్కృతిని పరిరక్షించుకోవడంతో పాటు అపదలో ఉండే సహచర తెలుగువారికి ఆపన్నహస్తం అందించడానికి ఉద్దేశించిన తెలుగు ప్రవాసీ సంఘాలు ఒక ప్రహాసంగా మారుతున్నాయి.
విశ్వవ్యాప్తంగా తమ రాష్ట్ర ప్రవాసీయులలో మలయాళీ భాష వ్యాప్తి, ప్రవాసీయుల సంక్షేమానికి తమ ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించే ప్రయత్నంలో భాగంగా పినరయి విజయన్ తలపెట్టిన పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించింది.
ఉత్తర అమెరికా తెలుగు సంఘం గ్రేటర్ అట్లాంటాలోని చార్లెస్టన్ పార్క్, లేక్ లేనియర్ కమ్మింగ్ లో నిర్వహించిన తానా హైక్ అండ్ కనెక్ట్ కార్యక్రమం అద్భుత విజయం సాధించింది. లేక్ లేనియర్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో తానా సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
విజయవాడ-సింగపూర్ డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసు త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబుకు శ్రీసాంస్కృతిక కళాసారథి అధ్యక్షులు రత్నకుమార్ కవుటూరు ధన్యవాదాలు తెలిపారు. ఈ దిశగా సీఎం హామీ ఇచ్చిన రెండు నెలలకే సర్వీసు ప్రారంభం కాబోతోందని హర్షం వ్యక్తం చేశారు.
విజయవాడలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించనున్న విదేశీ సంపర్క్ కార్యక్రమంపై రాష్ట్రంలో, విదేశాలలోనూ ఆసక్తి వ్యక్తమవుతోంది. తెలుగు ఎన్నారైల సమస్యలు పరిష్కారం అవుతాయన్న ఆశాభావం వ్యక్తమవుతోంది.
బ్రూనైలో వికసిత్ భారత్ పరుగు కార్యక్రమాన్ని భారత రాయబార కార్యాలయం విజయవంతంగా నిర్వహించింది. తమన్ మహ్కోటా జుబ్లీ ఎమాస్, ECO కారిడార్, బందర్ సేరిబెగావాన్ వద్ద.. భారత రాయబార కార్యాలయం – బ్రూనై దారుస్సలాం ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
దుబాయిలోని తెలుగు ప్రవాసీ సంఘమైన తెలుగు అసోసియెషన్ ఇటీవల బతుకమ్మ సంబురాలను అంగరంగ వైభవంగా నిర్వహించింది. ప్రప్రథమంగా దుబాయిలోని భారతీయ కాన్సుల్ జనరల్ సతీశ్ కుమార్ శివన్ తో పాటు స్థానిక ఇమరాతీ జాతీయులైన కొందరు ప్రముఖులు, దుబాయి ప్రభుత్వ అధికారులు కూడ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
'తెలుగు సమితి ఆఫ్ నెబ్రాస్కా' నూతన కార్యవర్గం కొలువుతీరింది. అమెరికాలోని నెబ్రాస్కా రాష్ట్రం, ఓమాహా నగరంలో ఉన్న 'ఓమాహా హిందూ టెంపుల్ కమ్యూనిటీ సెంటర్'లో ఈ ఆవిష్కరణ సమావేశం..