Tenneti Sudha Devi: అంతర్జాతీయ వేదికపై తెన్నేటి సుధాదేవికి ఘన నివాళి..
ABN , Publish Date - Dec 16 , 2025 | 08:16 PM
ప్రఖ్యాత కథా, నవలా రచయిత్రి, తెలుగు అకాడమీ పూర్వ ఉపసంచాలకులు అయిన తెన్నేటి సుధాదేవి సంస్మరణ సభ శనివారం ఘనంగా నిర్వహించారు. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, వంశీ ఇంటర్నేషనల్ & శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం ఇంటర్నెట్ ద్వారా ఈ సంస్మరణ సభను నిర్వహించారు.
ప్రఖ్యాత కథా, నవలా రచయిత్రి, తెలుగు అకాడమీ పూర్వ ఉపసంచాలకులు అయిన తెన్నేటి సుధాదేవి సంస్మరణ సభ శనివారం ఘనంగా నిర్వహించారు. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, వంశీ ఇంటర్నేషనల్ & శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం ఇంటర్నెట్ ద్వారా ఈ సంస్మరణ సభను నిర్వహించారు. వంశీ సంస్థల వ్యవస్థాపకులైన వంశీ రామరాజు గారి భార్య అయిన సుధాదేవి నవంబర్ 23వ తేదీన హైదరాబాద్‌లో స్వర్గస్తులయ్యారు (NRI news).
సుధాదేవి స్మరణలో, వివిధ దేశాల తెలుగు ప్రవాస సంస్థల ప్రతినిధులు, అలాగే భారతదేశంలోని చెన్నై, ముంబై, విశాఖపట్నం నగరాలలో ఉండే ప్రముఖులు, ఆప్తులు ఆమెకు నివాళులు అర్పించారు. అందరూ వీడియో కాల్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని నిర్వహకులు వంగూరి ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ వంగూరి చిట్టెన్ రాజు, శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థ అధ్యక్షుడు కవుటూరు రత్నకుమార్, కార్యక్రమ సమన్వయకర్త రాధిక మంగిపూడి తెలియజేశారు (NRI community event).

సుమారు నాలుగు గంటల పాటు కొనసాగిన ఈ కార్యక్రమంలో శిరోమణి వంశీ రామరాజు ఇంటర్నెట్ ద్వారా అన్ని దేశాల నుంచి తమ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. భారత్ నుంచి మాత్రమే కాక సుమారు పది దేశాల నుంచి 50 మంది వరకు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు (memorial programme).

భారతదేశం నుంచి వంశీ సంస్థలతో అవినాభావ సంబంధం ఉన్న యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్, మేడసాని మోహన్, సినీ దర్శకులు రేలంగి నరసింహారావు, సినీ రచయిత భువనచంద్ర, సంగీత విద్వాంసుడు గరికపాటి ప్రభాకర్, గాయకుడు గజల్ శ్రీనివాస్, గాయని సురేఖ మూర్తి, హాస్యబ్రహ్మ శంకరనారాయణ, సినీ నటుడు సుబ్బరాయశర్మ, సాహితీవేత్త ఓలేటి పార్వతీశం, రచయిత్రి జలంధర చంద్రమోహన్, రాజకీయవేత్త వామరాజు సత్యమూర్తి, అవధాని పాలపర్తి శ్యామలానంద ప్రసాద్, జుర్రు చెన్నయ్య, పొత్తూరి సుబ్బారావు తదితర ప్రముఖులు పాల్గొన్నారు (tribute meeting).

ఈ కార్యక్రమంలో అమెరికా, సింగపూర్, ఖతార్, కువైట్, సౌదీ అరేబియా, ఉగాండా, మలేషియా, హాంకాంగ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తదితర దేశాల నుంచి కృష్ణవేణి శ్రీ పేరి, సుచిత్ర, బూరుగుపల్లి వ్యాసకృష్ణ, సత్య మల్లుల, పద్మ మల్లెల, జయ పీసపాటి, స్వాతి జంగా, విక్రమ్ సుఖవాసి, వెంకప్ప భాగవతుల, సీతాపతి అరికరేవుల, తాతాజీ, పద్మజ ఉసిరికల, శ్రీసుధ, మాధవీ లలిత, సాహిత్య జ్యోత్స్న, కోనేరు ఉమామహేశ్వర రావు, శారదా పూర్ణ శొంఠి, శారద ఆకునూరి, రాధిక నోరి, రాధ కాసినాథుని, కె ధర్మారావు, గుణ కొమ్మారెడ్డి, సత్యమూర్తి, సుజాత కోటంరాజు, బీ కె మోహన్ పాల్గొని వంశీ సంస్థలతో, సుధాదేవితో తమకున్న అనుబంధాన్ని నెమరు వేసుకుంటూ ఆమెను స్మరించుకున్నారు. కల్చరల్ టీవీ వారు సాంకేతిక సహకారం అందించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం అయింది.
ఈ వార్తలు కూడా చదవండి
సాల్ట్ లేక్ సిటీలో శంకర నేత్రాలయ నిధుల సేకరణ కార్యక్రమం
సుందర్ పిచాయ్‌తో ఏపీలో టెక్ పెట్టుబడులపై మంత్రి లోకేశ్ చర్చ