Share News

TKS Cultural Event: ఖతర్‌లో వైభవంగా తెలుగు కళా సమితి సాంస్కృతిక సమ్మేళనం

ABN , Publish Date - Dec 09 , 2025 | 08:06 PM

తెలుగు ప్రవాసీ సంఘం తెలుగు కళా సమితి నూతన కార్యవర్గం కోలువుదీరింది. పలు సాంస్కృతిక సమ్మేళనాన్ని నిర్వహించి తమ కార్యకలాపాలకు నాంది పలికింది. ఈ ఈవెంట్‌లో కార్యక్రమాలు సభికులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

TKS Cultural Event: ఖతర్‌లో వైభవంగా తెలుగు కళా సమితి సాంస్కృతిక సమ్మేళనం
TKS Cultural Event

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: ఖతర్‌లోని తెలుగు ప్రవాసీ సంఘం తెలుగు కళా సమితి నూతన కార్యవర్గం ఇటీవల సాంస్కృతిక సమ్మేళనాన్ని నిర్వహించి తమ కార్యకలాపాలకు నాంది పలికింది. స్థానిక తెలుగు కుటుంబాలలోని కళా సృజనాత్మకతను వెలికి తీయడంలో భాగంగా నిర్వహించిన చిన్నారుల కూచిపూడి నృత్య ప్రదర్శన సహా వివిధ రకాల సాంస్కృతిక ప్రదర్శనలు, జానపద శాస్ర్తీయ సంగీత కార్యక్రమాలు సభికులను అలరించాయి. వీటికి తోడు సినీ నృత్యాలు ప్రదర్శనలు ఉత్తేజపరిచాయి.

మాతృభూమికి దూరంగా పరాయిగడ్డపై తమ భాష, సంప్రదాయాలను సంరక్షిస్తూ భారతీయతను చాటుతున్న తెలుగు ప్రవాసీయులు అభినందనీయులని ఖతర్‌లోని భారతీయ దౌత్యవేత్త వైభవ్ తాండలే ప్రశంసించారు. చిన్న,పెద్ద, ఆడ,మగ అనే తేడా లేకుండా అందరు కలిసి చాటుతున్న తెలుగుదనం తీయగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

6.jpg


తమపై విశ్వాసం, అభిమానంతో ఏకగ్రీవంగా తమను ఎన్నుకున్నందుకు తమ బాధ్యత మరింత పెరిగిందని తెలుగు కళా సమితి అధ్యక్షుడు మలిరెడ్డి వీర వెంకట సత్యనారాయణ (సత్య) పేర్కొన్నారు.

కార్యక్రమంలో ఖతర్‌లోని ప్రవాసీ ప్రముఖులు ఏ.పీ. మణికంఠన్-ఐసీసీ, షానా వాస్ బావ -ICBF, అబ్దుల్ రెహ్మాన్ – ISC ప్రత్యేక అతిథులుగా పాల్గొని నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు. ఐ.సి.సి. మేనేజ్‌మెంట్ కమిటీ సభ్యులు శంతనూ దేశ్‌పాండే, అబ్రహం జోసెఫ్, అఫ్జల్ అబ్దుల్ మాజిద్, ప్రదీప్ పిళ్ళై, బిశ్వజిత్ బెనెర్జీ, రాకేష్ వాఘ్, రవీంద్ర ప్రసాద్, సందీప్, వెంకప్ప, నందిని, తెలుగు ప్రముఖులు ప్రసాద్, కృష్ణ కుమార్, శంకర్ గౌడ్-ICBF, ఖాజా నిజాముద్దీన్-ICBF, సోమరాజు-ISC, దీపక్-ISC, వివిధ సంఘాల అధ్యక్షులు శ్రీనివాస్-TPS, దొర-AKV, నరసింహం-APWA, శ్రీనివాస్-SIF, మధు-TGS, మహమ్మద్ షోయబ్-TWA, నవాజ్ అలీ -TEF, శ్రీధర్ అబ్బగౌని-TSC, ప్రవీణ లక్ష్మి – TJQ, శ్రీ రమేష్ తదితరులు పాల్గోన్నారు.

తెలుగు కళా సమితి కార్యవర్గ సభ్యులైన సత్యనారాయణ బుచ్చయ్య, సాహిత్య జ్యోత్స్న, హేమ సత్య రేఖ, నాయుడు, నరేష్ కుమార్, ప్రవీణ్ కుమార్, వెంకట నారాయణ రాజు, శంకర్ కార్యక్రమాన్ని సమన్వయం చేసినట్లుగా సత్య తెలిపారు.

4.jpg3.jpg5.jpg2.jpg


ఈ వార్తలు కూడా చదవండి

ఖతర్‌లో ఏపీ వెల్ఫేర్ అసోసియేషన్ వార్షికోత్సవ సభ

పెట్టుబడులపై స్పెషల్ ఫోకస్.. అమెరికాలో లోకేశ్ విస్తృత పర్యటన

Read Latest and NRI News

Updated Date - Dec 10 , 2025 | 12:19 PM