Gulf: ఎడారి మాయ లేడీతో చిక్కులు.. అజ్ఞాతంలో ఉన్న భర్త కోసం మలయాళీ మహిళ అన్వేషణ
ABN , Publish Date - Dec 15 , 2025 | 08:33 PM
తన భర్త మరో మహిళను వివాహమాడి ఆంధ్రాలో తలదాచుకున్నాడని ఓ కేరళ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ఆంధ్రలో ఎక్కడుంటున్నాడో తెలియని అతడిని ఆచూకీని తెలియజేయాలని విజ్ఞప్తి చేసింది.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: గల్ఫ్ దేశాలకు వచ్చిన భారతీయులు కొందరు తప్పిపోవడం లేదా కుటుంబాలతో సంబంధాలు తెంపుకోవడం మామూలు విషయమే కానీ అనూహ్యంగా గల్ఫ్ నుండి ఆంధ్రాకు వెళ్ళాడో వ్యక్తి. తమకు దూరంగా అజ్ఞాతంలో గడుపుతున్న ఆ వ్యక్తిని వెతికిపెట్టమని అతడి కుటుంబం కోరడం ఆశ్చర్యకరమే. ఆంధ్రలో ఉన్న తన భర్త కోసం తన ముగ్గురు చిన్నారులతో ఓ మహిళ ప్రదక్షిణలు చేస్తోంది.
కేరళలోని మలప్పురం జిల్లాకు చెందిన పాలకుందన్ షాహనద్ అనే 30 ఏళ్ళ యువకుడు యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్‌లోని ఆబుధాబిలో పని చేస్తున్నాడు. తల్లితండ్రులకు ఏకైక కొడుకు అయిన షాహనద్‌కు భార్య జంషీరా, ముగ్గురు పిల్లలు ఉన్నారు. షాహనద్ పని చేస్తున్న కంపెనీ సమీపంలో పశ్చిమ గోదావరి జిల్లా పోడురు మండలం కవిటం గ్రామానికి చెందిన ఒక యువతి కూడా పని చేస్తుండగా వారి మధ్య ఏర్పడ్డ పరిచయం ప్రేమకు, అక్రమ సంబంధానికి దారి తీసింది. తన ఉద్యోగాన్ని, కుటుంబాన్ని వదిలి సదరు యువకుడు తెలుగు యువతి వెంట పశ్చిమ గోదావరి జిల్లాకు వచ్చి అమెతో కాపురం చేస్తున్నట్లుగా కేరళలోని అతని కుటుంబం అరోపిస్తోంది.
సదరు యువతి మాయమాటలతో మభ్యపెట్టి షాహనద్‌తో చర్చిలో పెళ్ళి కూడ చేసుకుందనే సమాచారం తమకు ఉన్నట్లుగా కేరళ కుటుంబం చెబుతోంది. ముగ్గురు పిల్లలు, భార్య ఉండగా ఏ రకంగా, ఏ చట్టం, ధర్మం ప్రకారం సదరు యువతి తమ కొడుకును రెండవ వివాహం చేసుకుంటుందని వారు ప్రశ్నిస్తున్నారు. తమ కొడుకును అప్పగించడంలో సహాయం చేయాలని మలయాళీ కుటుంబం కోరుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి
సాల్ట్ లేక్ సిటీలో శంకర నేత్రాలయ నిధుల సేకరణ కార్యక్రమం
సుందర్ పిచాయ్‌తో ఏపీలో టెక్ పెట్టుబడులపై మంత్రి లోకేశ్ చర్చ