ప్రముఖ పారిశ్రామికవేత్త అంబానీ ఇంట జరిగే ప్రతి వేడుకా, ఆ కుటుంబం ధరించే ప్రతి నగా యావత్ ప్రపంచాన్నీ ఆకర్షించేంత వైభవంగా ఉంటుంది. తాజాగా చవితినాడు నీతాఅంబానీ ధరించిన‘ఆమ్రపాలి భారతం’ అనే ఒక భారీ నగ అందర్నీ ఆకట్టుకుంది. విభిన్న ఆభరణాల మిశ్రమమైన ఈ ఆభరణం విశేషాల గురించి తెలుసుకుందాం!
యువతుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తూ, భారత రాజ్యాంగాన్ని దిక్సూచిగా మార్చి వారి విద్య, సామాజిక హక్కుల సాధనకు నిరంతరం శ్రమిస్తున్న క్షేత్రస్థాయి యోధురాలు దీపా పవార్.
నిమ్మకాయలో పులుపును ఇచ్చే సిట్రిక్ ఆమ్లం, విటమిన్ సి, పీచు పదార్థాలు, సువాసననిచ్చే సహజ తైలాలు, ఇంకా ఎన్నో వృక్ష రసాయనాలు ఉంటాయి. వాటిలో ఫ్లేవనాయిడ్లు, లిమోనాయిడ్లు, ఇతర ఫీనాలిక్ పదార్థాలు కూడా ఉన్నాయి.
అందం గురించి మనకెవరూ నేర్పించలేదు. అమ్మలు, అమ్మమ్మలను గమనిస్తూ, వాళ్లు శింగారించుకునే విధానాన్ని మనదిగా మార్చుకున్నాం! రసాయనాలకూ, కృత్రిమ రంగులకూ తావు లేని సహజ సౌందర్యమది. ఆ ఆరోగ్యకరమైన అందాన్ని సొంతం చేసుకోవడం సులభమే! అదెలాగో తెలుసుకుందాం!
మఖానాతో రకరకాల వంటకాలు ఎలా చేసుకుకోవాలో తెలుసుకుందాం....
మంచి చెడుల విచక్షణ ప్రతి మనిషికీ ఉంటుంది. సజ్జనులు ఆ విచక్షణతో జీవిస్తారు. మంచి పనులు చేస్తారు. చెడుకు దూరంగా ఉంటారు. చెడ్డ వ్యక్తుల సాంగత్యం, చెడు పనుల పట్ల ఆకర్షణ కారణంగా తమ సహజసిద్ధమైన విచక్షణను మనుషులు కోల్పోతారు. దీనివల్ల ఇతరులకు తమ వల్ల హాని కలిగినా... పశ్చాత్తాప భావన వారిలో ఉండదు. చివరకు దైవానుగ్రహానికి వారు దూరమైపోతారు. కాబట్టి మన చర్యలను సమీక్షిస్తూ, విమర్శిస్తూ... మనల్ని సన్మార్గంలో నడిపించేలా అంతరాత్మను కాపాడుకోవాలి. ‘నఫ్స్ అల్ లవ్వామ’ ప్రాధాన్యత గురించి దివ్య ఖురాన్ వివరించింది. ‘నఫ్స్ అల్ లవ్వాల’ అంటే ‘విమర్శించే అంతరాత్మ’ అని అర్థం. ‘‘మనిషి ఎన్ని సాకులు చెప్పినా... అతని గురించి అతనికి చాలా బాగా తెలుసు’’ అని దివ్య ఖురాన్ చెబుతోంది. ‘‘ఏది మంచి, ఏది చెడు అనే మీమాంస వచ్చినప్పుడు... అంతరంగాన్ని అడగాలి. మనస్సాక్షిని ప్రశ్నించి, సమాధానం తెలుసుకోవాలి. ఏ పని వల్ల హృదయానికి అశాంతి కలుగుతుందో, ఏ పని చేస్తున్నప్పుడు మన మనసు బాధపడుతుందో, మనం చేసిన ఏ పని గురించి ఇతరులు తెలుసుకోవడానికి ఇష్టపడమో అది చెడు అని గ్రహించాలి. ‘ఆ పని మంచిదే’ అని ఇతరులు ప్రోత్సహించినా... చెడు పనులు చేయకూడదు. అదే సత్ప్రవర్తన’’ అని దైవప్రవక్త మహమ్మద్ స్పష్టం చేశారు. విచక్షణ, ఆత్మవిమర్శ... ఇవి మానవులకు దేవుడు ప్రసాదించిన వరాలు. వాటిని వినియోగించుకొని మంచి ప్రవర్తనతో మెలిగేవారు దైవానికి ప్రీతిపాత్రులవుతారు.
దేవాలయంలో ప్రవేశించగానే... ఆ ఆవరణలో ధ్వజస్తంభం సమున్నతంగా కనిపిస్తుంది. ఆలయాల్లో విధిగా వీటిని ప్రతిష్ఠించాలనే ఆచారం వెనుక పౌరాణికమైన కథ ఒకటి ఉంది. మయూరధ్వజుడు... మణిపుర పాలకుడు. అతను మహా పరాక్రమశాలి, గొప్ప దానశీలి.
క్రైస్తవ జీవనానికి పునాది త్యాగం. ‘త్యాగం’ అంటే మనకు ఇష్టమైనదాన్ని వదులుకోవడం. దేవుడు తన ఏకైక కుమారుడైన ఏసుక్రీస్తును ఈ భూలోకానికి పంపాడు. క్రీస్తు తన ఇష్టాన్ని కాకుండా... ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. మానవాళి శ్రేయస్సు కోసం శిలువను ఎక్కి, ప్రాణత్యాగం చేశాడు. ఆ త్యాగాన్ని విశ్వాసులు నిత్యం గుర్తు చేసుకోవాలి.
రాధాదేవి...శ్రీకృష్ణుని అంతరంగ ఆహ్లాద శక్తి స్వరూపిణి. సర్వశక్తిమంతుడైన శ్రీకృష్ణుడు ఆమె నిష్కల్మష భక్తికే వశుడు అవుతాడు. ఆ పరదేవత ఆవిర్భావాన్ని స్మరిస్తూ, ఆమె కరుణ ద్వారా శ్రీకృష్ణుని కృపను పొందే పవిత్రమైన సందర్భం... రాధాష్టమి.
తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామివారికి నిత్యోత్సవాలు మొదలు అనేక ఉత్సవాలను నిర్వహిస్తారు. వాటిలో భక్తులకు అత్యంత సుపరిచితమైనవి ప్రతి సంవత్సరం జరిగే బ్రహ్మోత్సవాలు. నిత్యారాధనల్లో జరిగే లోటుపాట్లకు ప్రాయశ్చిత్తంగా తొమ్మిది రోజులపాటు నిర్వహిస్తారు. పూర్వం ఏడాదిలో అనేకసార్లు బ్రహ్మోత్సవాలు జరిగేవని చరిత్ర చెబుతోంది.