Share News

మువ్వన్నెల యాసెసరీస్‌...

ABN , Publish Date - Jan 26 , 2026 | 02:27 AM

రిపబ్లిక్‌ డే రోజున అందరిలో స్పెషల్‌గా కనిపించాలంటే ఈ యాసెసరీ్‌సను తయారుచేసుకుని ధరిస్తే చాలు...

మువ్వన్నెల యాసెసరీస్‌...

రిపబ్లిక్‌ డే రోజున అందరిలో స్పెషల్‌గా కనిపించాలంటే ఈ యాసెసరీ్‌సను తయారుచేసుకుని ధరిస్తే చాలు...

  • మీ చేతి సైజు మెటల్‌ బ్యాంగిల్స్‌ మూడింటిని తీసుకోవాలి. ఒకదానికి కాషాయం రంగు ఉన్ని దారాన్ని రెండోదానికి తెల్లని ఊలును, మూడోదానికి ఆకుపచ్చని ఊలు దారాన్ని చుట్టాలి. ఈ మూడింటిని జెండా రంగుల ఆర్డర్‌లో అతికించాలి. మీ దగ్గర లావుపాటి గాజు ఉంటే దాన్ని మూడు భాగాలుగా మార్కు చేసుకుని ఒక భాగంలో కాషాయం ఊలును రెండో భాగంలో తెల్లని ఊలును, చివరి భాగంలో ఆకుపచ్చని ఊలును చుట్టి అతికించాలి. అంతే తిరంగా బ్యాండ్‌ రెడీ!

  • వెడల్పాటి హెయిడ్‌ బ్యాండ్‌ను తీసుకుని దానికి ఒక చివరన కాషాయం రంగు ఊలుదారాన్ని, రెండో చివర ఆకుపచ్చని ఊలుదారాన్ని, మధ్యలో తెల్లని ఊలును చుట్టి అతికించాలి. వీటిమీద అక్కడక్కడ మెరిసే క్రిష్టల్స్‌ను అతికిస్తే అందమైన మవ్వన్నెల బ్యాండ్‌ రెడీ! ఇలాగే జెండా రంగుల్లో ఉన్న శాటిన్‌ రిబ్బన్స్‌ అతికించి కూడా బ్యాండ్‌ రెడీ చేసుకోవచ్చు.

  • ఒక గుండు సూదిని తీసుకుని కోడిగుడ్డు ఆకారంలో ఉండే ఆకుపచ్చని పూసను తరువాత తెల్లని పూసను, ఆపైన కాషాయం రంగు పూసను ఎక్కించాలి. తరువాత గుండుసూదిని కిందికి మడిచి రింగులా చేయాలి. ఇలాగే రెండో దాన్నీ తయారు చేయాలి. వీటిని మీ వద్ద ఉన్న ప్లెయిన్‌ మెటల్‌ హూప్స్‌కు హ్యాంగ్‌ చేయాలి. చక్కని తిరంగా జుంకాలు రెడీ! ఇలాగే థర్మకోల్‌ బాల్స్‌తో కూడా జుంకాలు సిద్దం చేసుకోవచ్చు.

  • వెడల్పాటి డబుల్‌సైడ్‌ స్టిక్కర్‌ను తీసుకోవాలి. టిక్‌టాక్‌ క్లిప్‌కు సరిపడేలా కట్‌చేసి దానికి క్లిప్‌ను గుచ్చి పై భాగాన్ని గమ్‌తో అతికించాలి. దీనికి సరిపడేలా మరికొంత స్టిక్కర్‌ను కట్‌చేసి దాన్ని మూడు సమాన భాగాలుగా పొడవుగా కట్‌ చేయాలి. వీటికి జెండా రంగులను వేయాలి. టిక్‌టాక్‌ క్లిప్‌కు పైన కాషాయం స్టిక్కర్‌, దానికింద తెల్లనిదాన్ని, చివరన ఆకుపచ్చని స్టిక్కర్‌ను అంటించాలి. మధ్యలో చిన్న అశోకచక్రం గీసిన కాగితాన్ని అంటిస్తే సరి, చక్కని బ్రూచ్‌ రెడీ!

ఇవి కూడా చదవండి..

త్వరలోనే మూడో ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా భారత్.. జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి గణతంత్ర ప్రసంగం

ఇది ఎన్నికల పోరు కాదు, ప్రజాస్వామ్య యుద్ధం.. విజయ్

Read Latest National News

Updated Date - Jan 26 , 2026 | 02:27 AM