Share News

బలమైన ఎముకల కోసం...

ABN , Publish Date - Jan 25 , 2026 | 04:39 AM

ఎముకల బలోపేతానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం...

బలమైన ఎముకల కోసం...

ఎముకల బలోపేతానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం...

  • రోజూ పాలు, పెరుగు, మజ్జిగ, చీజ్‌ తీసుకోవడం వల్ల ఎముకలకు కావాల్సిన కాల్షియం అందుతుంది. దీంతో శరీరానికి డి విటమిన్‌ను శోషించుకునే శక్తి పెరిగి ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి.

  • తరచూ పాలకూర, గోంగూర, మెంతికూరలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎముకల సమస్యలు దరిచేరవు.

  • పెరిగే పిల్లలకు వేరుశనగ గుండ్లు, నువ్వులను ఆహారంలో చేర్చడం వల్ల వాటిలోని ఆరోగ్యకరమైన కొవ్వులు, కాల్షియం, మెగ్నీషియం, పాస్ఫరస్‌, ఇతర పోషకాలు అంది ఎముకలు దృఢంగా మారతాయి.

  • కోడిగుడ్లు, పెసలు, శనగలు, మినప్పప్పు, చిక్కుళ్లు, సోయా చంక్స్‌లో ప్రొటీన్లు, కాల్షియం సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యానికి దోహదం చేస్తాయి.

  • సాల్మోన్‌, ట్యూనా చేపలను తినడం వల్ల వాటిలోని డి విటమిన్‌, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎముకలను బలోపేతం చేస్తాయి.

  • బాదం, ఖర్జూరాలు, ఎండు ద్రాక్ష, డ్రై అంజూర్‌లను తినడం వల్ల ఎముకల సాంద్రత పెరుగుతుంది.

ఇవి కూడా చదవండి..

మందు కొడితే ఇలాగే ఉంటుందేమో.. సముద్రంలో చనిపోయిన తిమింగలంతో..

గేదెను చుట్టుముట్టిన సింహాల గుంపు.. ప్రాణం తీసే సమయంలో షాకింగ్ ట్విస్ట్..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 25 , 2026 | 04:39 AM