Share News

వెండి.. సిరుల వెలుగు

ABN , Publish Date - Jan 26 , 2026 | 02:34 AM

పసిడి ధరలు చుక్కలను తాకుతుంటే పెళ్లిళ్లు నిశ్చయమైన ఇళ్లలో టెన్షన్‌ మొదలైంది. అయితే, కంగారు పడాల్సింది ఏమీ లేదు. పసిడికి ధీటుగా, రాజసం ఉట్టిపడేలా వస్తున్న...

వెండి.. సిరుల వెలుగు

పసిడి ధరలు చుక్కలను తాకుతుంటే పెళ్లిళ్లు నిశ్చయమైన ఇళ్లలో టెన్షన్‌ మొదలైంది. అయితే, కంగారు పడాల్సింది ఏమీ లేదు. పసిడికి ధీటుగా, రాజసం ఉట్టిపడేలా వస్తున్న వెండి ఆభరణాలు ఇప్పుడు ట్రెండ్‌ సెట్‌ చేస్తున్నాయి. తక్కువ ధరలో ఎక్కువ అందాన్ని ఇచ్చే ఈ వెండినగలు మధ్యతరగతి వారి వేడుకల్లో కొత్త కళను తీసుకొస్తాయంటున్నారు జెమాలజిస్ట్‌, జువెలరీ డిజైనర్‌ రాధికా మన్నె.

జాగ్రత్తలు తీసుకోండిలా

  • మురికి పట్టినప్పుడు మెత్తని సోప్‌ నీటితో కడిగి మృదువైన వస్త్రంతో తుడవాలి.

  • గీతలు పడకుండా ఉండేదుకు ఇతర నగలతో కలపకుండా విడిగా భద్రపరచాలి.

  • గాఢమైన కెమికల్స్‌, సెంట్రిఫ్యూగల్‌ వేడికి దూరంగా ఉంచాలి.

డిజైనర్ల చాయిస్‌: వెండి మెత్తని లోహం కావడం వల్ల కళాకారులు ఇందులో అత్యంత క్లిష్టమైన డిజైన్లను (ఫిలిగ్రీ వర్క్‌) సులభంగా మలచగలరు.

మన్నిక: నిత్యం ధరించినా వెండి నగలు పాడవవు. అందుకే నేటి యువత ఆఫీస్‌ వేర్‌ కోసం మినిమలిస్ట్‌ వెండి నగలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు.

సరసమైన ధర: తక్కువ బడ్జెట్‌లోనే హై క్వాలిటీ, స్టైలిష్‌ లుక్‌ పొందాలనుకుంటే వెండి ప్రత్యామ్నాయం.

పెట్టుబడిదారులకు పండుగ

పారిశ్రామిక డిమాండ్‌: ఎలక్ట్రిక్‌ వాహనాలు, సోలార్‌ ప్యానెల్స్‌, ఎలకా్ట్రనిక్‌ వస్తువుల తయారీలో వెండి వాడకం తప్పనిసరి. సాంకేతిక రంగం ఎంతగా విస్తరిస్తే వెండికి అంత డిమాండ్‌ పెరుగుతుంది.

సురక్షితమైన పెట్టుబడి: ద్రవ్యోల్బణం పెరిగినా, ఆర్థిక అనిశ్చితి నెలకొన్నా బంగారంలా వెండి కూడా ఇన్వెస్టర్లకు అండగా నిలుస్తుంది.

మార్కెట్లో కొత్త ట్రెండ్‌

ఆధునికత-సంప్రదాయం: టెంపుల్‌ జువెలరీ, పట్టీలు వంటి పాతకాలపు డిజైన్లకు నేటి తరం అభిరుచులకు తగినట్టుగా మోడ్రన్‌ టచ్‌ ఇస్తున్నారు.

ఎకో ఫ్రెండ్లీ: పర్యావరణ స్పృహ పెరగడంతో చాలామంది సస్టెయినబుల్‌ సిల్వర్‌ వైపు చూస్తున్నారు.

డిజిటల్‌ విక్రయాలు: ఈ-కామర్స్‌ పుణ్యమా అని నచ్చిన డిజైన్లను ఇంట్లోనే ఉండి ఆర్టర్‌ చేసుకునే సౌలభ్యం పెరిగింది.


డైమండ్‌-సిల్వర్‌ జోడీ

వజ్రం అంటేనే విలాసం.. వెండి అంటేనే వైవిధ్యం. ఈ రెండూ కలిస్తే.. చూసే కళ్లకు పండుగే. ఈ అద్భుత కాంబినేషన్‌ వల్ల కలిగే ప్రయోజనాలు, డిజైన్ల విశేషాలు మీ కోసం..

వెండితోనే ఎందుకు?

సాధారణంగా వజ్రాలను బంగారం లేదా ప్లాటినంలో పొదుగుతారు. కానీ వెండితో కలిసినప్పుడు సరికొత్త మెరుపును సంతరించుకుంటాయి.

మన్నిక: వెండి నగలను నిత్యం ధరించినా చెక్కుచెదరవు

తక్కువ ధర.. ఎక్కువ అందం: పసిడి ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఈ రోజుల్లో వెండిలో డైమండ్‌ జువెల్లరీ మధ్య తరగతి వారికి కూడా ‘అఫర్డ్‌బుల్‌ లగ్జరీ’ని అందిస్తోంది.

మిరుమిట్లు గొలిపే డిజైన్లు

హాలో సెట్టింగ్‌: మధ్యలో ఉండే వజ్రం చుట్టూ చిన్నచిన్న వజ్రాలను అమర్చడం వల్ల మరింత వెలుగు కనిపిస్తుంది.

పావే సెట్టింగ్‌: వెండి పట్టీపై చిన్న వజ్రాలను వరుసగా పేర్చడం వల్ల నగ అంతా మెరుస్తూ ఉంటుంది.

టెన్షన్‌ సెట్టింగ్‌: వజ్రం గాలిలో తేలుతున్నట్టుగా వెండి పట్టీల మధ్య అమర్చే ఆధునిక డిజైన్‌ ఇది.

ఫిలిగ్రీ వర్క్‌: వెండి తీగలతో అల్లిన పురాతనశైలి డిజైన్లు వజ్రాలకు ఒక వింటేజ్‌ లుక్‌ను ఇస్తాయి.


డెస్టినేషన్‌ వెడ్డింగ్స్‌కు భరోసా?

ప్రస్తుత కాలంలో డెస్టినేషన్‌ వెడ్డింగ్స్‌ అంటే కేవలం ఆడంబరమే కాదు, ప్రయాణంలో భద్రత కూడా ముఖ్యం. అందుకే ఖరీదైన బంగారు నగలకు బదులుగా అత్యంత ఆకర్షణీయమైన సిల్వర్‌ జువెలరీని ఎంచుకోవడం ఒక స్మార్ట్‌ ఆప్షన్‌. ఎందుకంటే?

భద్రతతో కూడిన స్టైల్‌: వెండి నగలు చూడటానికి ఎంతో హుందాగా, క్లాసీగా కనిపిస్తాయి. బంగారంతో పోలిస్తే ఇవి దొంగల కంటపడే అవకాశం తక్కువ. కాబట్టి కొత్త ప్రదేశాల్లో, జన సమ్మర్థం ఉన్నచోట కూడా మీరు టెన్షన్‌ లేకుండా ఎంజాయ్‌ చేయొచ్చు.

నిర్వహణ సులభం: వెండి నగలను శుభ్రం చేయడం, పాలిష్‌ చేయడం చాలా సులభం. ఫంక్షన్‌ జరిగే చోట మీరు వాటిని తక్కువ సమయంలోనే మెరిపించుకోవచ్చు.

గుర్తుంచుకోవాలి: ఖరీదైన నగ అంటే ఎక్కువ ధర ఉండాలని లేదు. అది విలువైన లోహంతో తయారైతే చాలు. ప్రపంచవ్యాప్తంగా బంగారం, ప్లాటినంతోపాటు వెండిని మాత్రమే ప్రీషియస్‌ మెటల్‌గా గుర్తిస్తారు. కాబట్టి వెండినగలు కూడా బంగారు నగల్లాగే స్వచ్ఛమైనవి, కళాత్మకమైనవి, జీవితకాలం మన్నికనిచ్చేవి.

రాధికా మన్నె, జెమాలజిస్ట్‌, జువెలరీ డిజైనర్‌

ఇవి కూడా చదవండి..

త్వరలోనే మూడో ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా భారత్.. జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి గణతంత్ర ప్రసంగం

ఇది ఎన్నికల పోరు కాదు, ప్రజాస్వామ్య యుద్ధం.. విజయ్

Read Latest National News

Updated Date - Jan 26 , 2026 | 02:34 AM