తిరంగా సలాడ్
ABN , Publish Date - Jan 26 , 2026 | 02:23 AM
రిపబ్లిక్ డే రోజున బడిలో ఎగురవేసే జాతీయ జెండా విశిష్టత గురించి పిల్లలకు వివరిస్తూ ఉదయాన్నే ఈ తిరంగా సలాడ్...
రిపబ్లిక్ డే రోజున బడిలో ఎగురవేసే జాతీయ జెండా విశిష్టత గురించి పిల్లలకు వివరిస్తూ ఉదయాన్నే ఈ తిరంగా సలాడ్ చేసి పెట్టండి. పిల్లలు ఆసక్తిగా తింటారు. దీన్ని ఎలా తయారుచేయాలంటే...
ఒక కప్పు కేరట్ తురుంలో.. వేయించి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసిన వేరుశనగ గుండ్ల పొడి రెండు చెంచాలు వేసి కలపాలి.
ఒక కప్పు పనీర్ తురుంలో రెండు క్యాబేజీ ఆకులను సన్నగా తరిగి వేయాలి.
ఒక కప్పు కీరా ముక్కల్లో రెండు చెంచాల కొత్తిమీర తరుగు, అర కప్పు పాలకూర తరుగు వేసి కలపాలి.
ఒక పళ్లెంలో పై భాగంలో కేరట్ తురుం దాని కింద పనీర్ తురుం, చివరలో కీరా ముక్కలు వేసి సమంగా పరచాలి.
కేరట్ తురుం, కీర ముక్కల భాగాల్లో ఒక్కోదానిలో రెండు చెంచాల ఆలివ్ ఆయిల్ వేసి చెంచా నిమ్మరసం చిలకరించి చెంచా నువ్వులు, అర చెంచా మిరియాల పొడి చల్లాలి.
పనీర్ తురుం భాగంలో పావు కప్పు నానబెట్టిన జీడిపప్పు పలుకులు, చెంచా ఆలివ్ ఆయిల్ వేసి రెండు చెంచాల పెరుగు చిలకరించి అరచెంచా రెడ్ చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా ఉప్పు చల్లాలి. మధ్యలో సన్నగా తరిగిన ఎర్ర క్యాబేజీ ఆకులు లేదా బీట్‌రూట్ చీలికలతో అశోక చక్రం తయారుచేసి పెట్టాలి. అంతే! తిరంగా సలాడ్ రెడీ!
ఇవి కూడా చదవండి..
త్వరలోనే మూడో ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా భారత్.. జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి గణతంత్ర ప్రసంగం
ఇది ఎన్నికల పోరు కాదు, ప్రజాస్వామ్య యుద్ధం.. విజయ్
Read Latest National News