ఖరీదైన, ఫ్యాన్సీ నంబర్ ప్లేట్‌ను వేలంలో దక్కించుకున్న హరియాణా వ్యక్తి చిక్కుల్లో పడ్డాడు. ఆయన ఆదాయం, ఆస్తులపై దర్యాప్తు చేయాలని అక్కడి అధికారులు ఆదేశించారు. ఇక.. ఈ వీఐపీ నంబర్‌ను మరోసారి వేలంలో ప్రవేశపెడుతున్నట్టు రవాణా శాఖ పేర్కొంది. మరి ఈసారి ఆ ఫ్యాన్సీ నంబర్‌ను ఎవరు పొందుతారు? ఎంత ధర పలుకుతుందనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది.
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల తర్వాత స్వచ్ఛందంగా యాప్ డౌన్లోడ్ చేసుకున్న సంఖ్య ఒక్కరోజులోనే పదింతలు పెరిగిందని డీఓటీ తెలిపింది. 1.4 కోట్ల మంది ఇప్పటికే ఈ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారని వివరించింది.
ఓ మహిళపై భర్త కుటుంబసభ్యులు దారుణానికి ఒడిగట్టారు. బతికుండగానే మహిళపై, ఆమె ప్రియుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ దారుణ సంఘటన రాజస్తాన్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది.
సంచార్ సాథీ వెబ్‌సైట్‌ను ఒకసారి చూసినట్టయితే ఈ వెబ్‌సైట్‌కు 20 కోట్ల వెబ్సైట్ హిట్లు వచ్చాయని, 1.4 కోట్ల మంది ఇప్పటికే ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారని కేంద్ర మంత్రి వివరించారు.
సంచర్ సాథీ యాప్‌తో వ్యక్తిగత జీవాతాలపై నిఘా పెడుతున్నారంటూ ఎంపీలు ఆందోళన వ్యక్తం చేయడంతో మంత్రి స్పందిస్తూ, వినియోగదారులు అక్కర్లేదనుకుంటే యాప్‌ను డిలీట్ చేయవచ్చని, యాక్టివేట్ చేసుకోకుంటే సరిపోతుందని అన్నారు.
డీఆర్జీ, ఎస్టీఎఫ్, కోబ్రా భద్రతా బలగాలు మవోయిస్టులకు మధ్య బుధవారం ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎదురు కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు.
యుద్ధ సమయంలో భారత యుద్ధ విమాన పైలట్లు ఇకపై ఆకాశంలో ఎంత ఎత్తుకెళ్లినా వారి ప్రాణాలకి ఢోకా లేదు. ఈ సాంకేతిక కోసం ఇప్పటి వరకూ విదేశాలపై ఆధారపడిన భారత్.. ఇక స్వయంగా తన పైలట్లను రక్షించుకోగలదు. దీనికి సంబంధించి చేసిన టెస్ట్ విజయవంతమైంది.
ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై ఎమ్మెల్యే కృష్ణ నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన కేవలం.. నాటుకోడి, చికెన్ సూప్‌కే ప్రాధాన్యం ఇస్తున్నారంటూ విమర్శించారు. ఈ వ్యాఖ్యలు కన్నడ నాట తీవ్ర సంచలనానికి దారితీశాయి. కాగా.. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై కాంగ్రెస్ వర్గాలు మండిపడున్నాయి.
వీధికుక్కలు వ్యవహించిన తీరు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అప్పడే పుట్టిన పసికందును కన్నవాళ్లు రోడ్డు మీద వదిలేస్తే, ఆ చిన్నారి చుట్టూ చేరి తెల్లవార్లూ రక్షణ కవచంగా నిలిచి ఆ బిడ్డ ప్రాణాలు కాపాడాయి అక్కడి వీధి శునకాలు..
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పై ఏఐ వీడియోల పరంపర కొనసాగుతోంది. గతంలో ఆయన్ను కించపరుస్తూ పలు ఏఐ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా చాయ్ అమ్ముతున్నట్లు ఉన్న ఏఐ వీడియోను కాంగ్రెస్ నాయకురాలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో కాంగ్రెస్ పై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.