ఫ్లైదుబాయ్ విమానంలో భారత పైలట్ స్మిత్ మచ్చార్‌పై ఒమన్ కోపైలట్ హమామ్ అల్ హమ్మామీ దాడిచేసిన తర్వాత విమానం ఇంజిన్లను షట్ డౌన్ చేసేందుకు యత్నించి ఉండవచ్చని ఇటలీ దినపత్రిక కొరియర్ డెల్లా సెరా పేర్కొంది.
సైబీరియాలోని ఓ ల్యాబ్‌లో పనిచేసే వ్యక్తి గుర్తుతెలియని ఇన్ఫెక్షన్తో మరణించడం రష్యాలో కలకలానికి దారి తీసింది. షెలెఖోవ్ ప్రాంతంలోని యాంటీ ప్లేగు పరిశోధన సంస్థలో ఈ ఘటన చోటుచేసుకుంది.
బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికల తొలి విడతలో ఉత్కంఠ కొనసాగింది. ఏ అభ్యర్థికీ 50 శాతానికి పైగా ఓట్లు రాకపోవడంతో అక్టోబర్ 25న రన్ఆఫ్ జరగనుంది. ఫ్లావియో బొల్సొనారో, లులా డా సిల్వా మధ్య తుది పోటీ నెలకొంది.
యూకేలోని గ్లూసెస్టర్‌షైర్‌లో బ్రిటిష్ మిలిటరీ బేస్ రాఫ్ ఫెయిర్‌ఫోర్డ్‌లో ఉన్న తన బీ1 బాంబర్లను అమెరికా స్వదేశానికి తరలించింది. ఆ బాంబర్లపై ఇరాన్ దాడికి పాల్పడేందుకు కుట్ర జరిపినట్లు అనుమానం రావడంతో అమెరికా వాటిని తన దేశానికి పంపింది.
ఫ్లైదుబాయ్ విమానంలో భారతీయ పైలట్ స్మిత్ మచ్చార్‌పై ఒమన్ కోపైలట్ హమామ్ అల్ హమ్మామీ దాడి చేసిన నేపథ్యంలో ఇజ్రాయెల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఇజ్రాయెల్‌కు వచ్చే అంతర్జాతీయ విమానాలపై భద్రతా సమీక్షలు నిర్వహించాలని అధికారులను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆదేశించారు.
దుబాయిలో బతుకమ్మ పండుగ పేరిట చందాల వసూళ్ల దందా మొదలైంది. తెలంగాణ ప్రవాసీయులు కొంత మంది ఫలానా నాయకులమంటూ..
రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధాన్ని ఆపడం కోసం భారతదేశం చేసిన ప్రతిపాదనలు అత్యంత సమగ్రంగా ఉన్నాయని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహా అన్నారు.
ఉక్రెయిన్‌లోని సుమీలో ఉన్న అతి పెద్ద ఫార్మా ప్లాంట్ రష్యా డ్రోన్ దాడిలో ధ్వంసం అయ్యింది. దాడిలో ఒకరు మృతి చెందగా పలువురు గాయపడ్డారు.
దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్‌అవీవ్‌కు వెళుతున్న ఫ్లైదుబాయ్ ఎఫ్‌జెడ్1073 విమానాన్ని కూల్చివేయాలనుకున్నానని కో-పైలట్ అల్‌హమ్మామీ అంగీకరించాడు.
అత్యాధునిక కృత్రిమ మేధ(అడ్వాన్స్డ్ ఏఐ) అభివృద్ధికి సహకారం అందించడం, దీనిపై ప్రభుత్వ స్థాయి ప్రయత్నాలను సమన్వయం చేసేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్..