షోయబ్ అక్తర్ సోదరుడి అంత్యక్రియల్లో లష్కరే ఉగ్రవాదులు, పహల్గాం సూత్రధారి..
ABN , Publish Date - Jun 27 , 2026 | 01:36 PM
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ సోదరుడు షాహిద్ అక్తర్ అంత్యక్రియల కార్యక్రమానికి లష్కరే తయ్యిబా ఉగ్రవాదులు హాజరుకావడం చర్చనీయాంశంగా మారింది. షాహిద్ అక్తర్ అంత్యక్రియలకు లష్కరేకు చెందిన కీలక నేతలు హాజరైనట్లు వైరల్ వీడియోలు వెలుగులోకి వచ్చాయి.
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ సోదరుడు షాహిద్ అక్తర్ అంత్యక్రియల కార్యక్రమానికి లష్కరే తయ్యిబా ఉగ్రవాదులు హాజరుకావడం చర్చనీయాంశంగా మారింది. షాహిద్ అక్తర్ అంత్యక్రియలకు లష్కరేకు చెందిన కీలక నేతలు హాజరైనట్లు వైరల్ వీడియోలు వెలుగులోకి వచ్చాయి. ఆ వీడియోల్లో పహల్గామ్ ఉగ్రదాడికి సూత్రధారి అయిన సైఫుల్లా కసూరీ కూడా కనిపించాడు (Shoaib Akhtar Brother Funeral).
షాహిద్ అక్తర్ జూన్ 24న కన్నుమూశారు. ఇస్లామాబాద్‌లోని హెచ్-8 శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లష్కరే ఉపనేత, పహల్గాం ఉగ్రదాడి మాస్టర్ మైండ్ సైఫుల్లా కసూరీతో పాటు పలువురు ఉగ్రవాదులు హాజరయ్యారు. అలాగే లష్కరే రాజకీయ విభాగం అయిన 'పాకిస్థాన్ మార్కాజీ ముస్లిం లీగ్' (PMML) అధ్యక్షుడు ఇనామ్ ఉర్ రెహ్మాన్ కూడా షాహిద్ అంత్యక్రియలకు హాజరైనట్లు వీడియోల్లో కనిపించింది. అంతర్జాతీయ ఉగ్రవాది అయిన హఫీద్ సయీజ్ ఈ పీఎంఎంఎల్ పార్టీని ఏర్పాటు చేశాడు (Saifullah Kasuri).
భారత వ్యతిరేక శక్తులకు పాక్ ఆశ్రయం కల్పిస్తోందని, ఉగ్రవాదులు అక్కడ ఎలాంటి ఆంక్షలూ లేకుండా బహిరంగంగా తిరుగుతున్నారని ఇప్పటికే ఎన్నో ఆరోపణలు ఉన్నాయి (Pahalgam Attack). తాజాగా కసూరీ ఇలా బహిరంగ కార్యక్రమంలో కనిపించడం ఆ ఆరోపణలకు మరింత బలం చేకూర్చింది. తాజా వీడియోల కారణంగా పాకిస్థాన్‌లో నిషేధిత ఉగ్ర సంస్థల కార్యకలాపాలపై మరోసారి అంతర్జాతీయ స్థాయిలో చర్చ మొదలైంది.
ఇవి కూడా చదవండి..
హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు.. ధన్యవాదాలు తెలిపిన అమెరికా అధ్యక్షుడు..
బంగారం ధరలు పెరిగాయ్.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..