Share News

అఫ్గానిస్థాన్‌లో భూకంపం.. ఢిల్లీ, జమ్మూకశ్మీర్‌‌లో కంపించిన భూమి..

ABN , Publish Date - Jun 27 , 2026 | 08:35 PM

అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం చోటుచేసుకుంది. రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 6.1గా నమోదయ్యింది. భారత కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 7:04 గంటల ప్రాంతంలో ఈ భూకంపం వచ్చింది.

అఫ్గానిస్థాన్‌లో భూకంపం.. ఢిల్లీ, జమ్మూకశ్మీర్‌‌లో కంపించిన భూమి..
Afghanistan earthquake

ఇంటర్‌నెట్ డెస్క్: అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం చోటుచేసుకుంది. రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 6.1గా నమోదయ్యింది. భారత కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 7:04 గంటల ప్రాంతంలో ఈ భూకంపం వచ్చింది. ఈశాన్య అఫ్గానిస్థాన్‌లోని కలాఫ్‌గాన్‌కు సుమారు 81 కిలోమీటర్ల దూరంలో.. ఫైజాబాద్‌కు దక్షిణంగా 74 కిలోమీటర్ల దూరంలో.. భూమి లోపల 215 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ తెలిపింది. భూకంపం చాలా లోతులో రావడం వల్ల ఉపరితలంపై దాని తీవ్రత తగ్గిందని ఎన్‌సీఎస్ వెల్లడించింది.


భూకంపం కారణంగా ప్రాణ నష్టం సంభవించిందా? లేదా? అన్న వివరాలు తెలియరాలేదు. అఫ్గానిస్థాన్‌లో భూకంపం రావటంతో దాని ప్రభావం భారత్‌లో కూడా కనిపించింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్, జమ్మూ కాశ్మీర్, పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్‌లోని పలు చోట్ల భూప్రకంపనలు సంభవించాయి. కశ్మీర్ లోయలో ప్రజలు భయంతో ఇళ్లు, ఆఫీసుల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. పాకిస్థాన్, చైనా, తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్, కిర్గిజ్‌స్థాన్, తుర్క్‌మెనిస్థాన్‌లలో కూడా భూప్రకంపనలు వచ్చాయి.


ఇవి కూడా చదవండి

ఎర్రకోట కారు బాంబు పేలుడు కేసు.. మరో చార్జ్ షీటు దాఖలు చేసిన ఎన్‌ఐఏ

ఏపీ ఎయిర్‌పోర్టుల్లో బార్ లైసెన్స్‌లకు ఎక్సైజ్ శాఖ గ్రీన్‌సిగ్నల్

Updated Date - Jun 27 , 2026 | 08:52 PM