వెనెజువెలా భూకంప బీభత్సం.. 920కు చేరిన మృతుల సంఖ్య, వేలాది మంది గల్లంతు..
ABN , Publish Date - Jun 27 , 2026 | 08:24 AM
వెనెజువెలాను కుదిపేసిన వరుస భూకంపాల విధ్వంసం మరింత తీవ్రమవుతోంది. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. జూన్ 24న సెకెన్ల వ్యవధిలో 7.2, 7.5 తీవ్రత గల రెండు శక్తిమంతమైన భూకంపాలు వెనెజువెలాను కుదిపేసిన సంగతి తెలిసిందే.
వెనెజువెలాను కుదిపేసిన వరుస భూకంపాల విధ్వంసం మరింత తీవ్రమవుతోంది. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. జూన్ 24న సెకెన్ల వ్యవధిలో 7.2, 7.5 తీవ్రత గల రెండు శక్తిమంతమైన భూకంపాలు వెనెజువెలాను కుదిపేసిన సంగతి తెలిసిందే. ఈ జంట భూకంపాల మరణాల సంఖ్య 920కు చేరినట్లు తాజాగా అధికారులు వెల్లడించారు (Venezuela Earthquake).
ఈ ప్రకృతి విపత్తు కారణంగా 3,000 మందికి పైగా గాయపడగా, 50 వేల మందికిపైగా ఆచూకీ తెలియకుండా పోయినట్లు అధికారులు పేర్కొన్నారు. శిథిలాల కింద ఇంకా వందలాది మంది చిక్కుకుని ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. రాజధాని కారకస్, లా గువేరా, యరాకుయ్, కారబోబో ప్రాంతాల్లో భారీ స్థాయిలో నష్టం జరిగింది. వందలాది భవనాలు కూలిపోగా, రహదారులు, వంతెనలు, ఆసుపత్రులు, విమానాశ్రయాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. విద్యుత్, సమాచార వ్యవస్థలు కూడా పలు ప్రాంతాల్లో నిలిచిపోయాయి (Venezuela Earthquake Death Toll).
అమెరికా భూగర్భ సర్వే (USGS) అంచనా ప్రకారం, గత 125 ఏళ్లలో వెనెజువెలాలో సంభవించిన అత్యంత శక్తిమంతమైన భూకంపాలు ఇవే (Venezuela News). కాగా, తీవ్రంగా నష్టపోయిన వెనెజువెలాను ఆదుకునేందుకు ప్రపంచ దేశాలు ముందుకు వస్తున్నాయి. పలు దేశాలు సహాయక బృందాలను, వైద్య సిబ్బందిని, అత్యవసర సహాయ సామగ్రిని పంపిస్తున్నాయి. భారత సైన్యం కూడా 'ఆపరేషన్ అమిస్తాద్' పేరుతో వైద్య బృందాన్ని వెనెజువెలాకు పంపుతోంది.
ఇవి కూడా చదవండి..
హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు.. ధన్యవాదాలు తెలిపిన అమెరికా అధ్యక్షుడు..
బంగారం ధరలు పెరిగాయ్.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..