మొకామా ప్రాంతంలో జేడీయూ అభ్యర్థి అనంత్ సింగ్ తరఫున లలన్ సింగ్ ఇటీవల ప్రచారంలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా పోలింగ్ రోజున విపక్ష నేతలను ఇళ్ల నుంచి బయటకు రానీయరాదని, ఇళ్లకు తాళాలు వేయాలని సూచించారు.
మరికొద్ది రోజుల్లో జరగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓటమి ఖాయమని బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ఓటమి భయం సీఎం రేవంత్ రెడ్డి పట్టుకుందని ఆయన పేర్కొన్నారు.
తేజస్విని సీఎం చేయాలని లాలూ, రాహుల్ గాంధీని ప్రధాని కావాలని సోనియాగాంధీ కలలు కంటున్నారని, అయితే వాళ్లు ఆ విషయం మరిచిపోవచ్చని, ఎందుకుంటే ఆ రెండు పోస్టులు ఖాళీగా లేవని అమిత్‌షా ఛలోక్తి విసిరారు. ఇక్కడ సీఎంగా నితీష్, అక్కడ పీఎంగా నరేంద్ర మోదీ ఉన్నారని చెప్పారు.
ఎన్నికలు వచ్చిన ప్రతిసారి మోదీపై వ్యక్తిగత విమర్శలు చేయడం కాంగ్రెస్ నేతలకు పరిపాటిగా మారిందని అమిత్‌షా అన్నారు. ఇలా చేసిన ప్రతిసారి బీజేపీకి ప్రజలు ఘనవిజయం కట్టబెట్టారని, ఈసారి కూడా అదే జరుగుతుందని, కాంగ్రెస్‌కు భంగపాటు తప్పదని అన్నారు.
అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ ఎన్నికల ప్రచారం చివరి రోజున ఒక సంచలనాత్మక ప్రకటన వచ్చింది. మహిళలకు ఏటా సంక్రాంతికి రూ.30 వేలు.. వాళ్ల బ్యాంకు ఖాతాల్లో జమచేస్తామని ఎన్నికల హామీ ఇచ్చారు..
ఎన్నికల ప్రచారం చాలా బాగా జరుగుతోందని, కూటమి విజయం సాధిస్తుందని లాలూ చెప్పారు. స్థానిక నేతలు కూడా బాగా పనిచేస్తున్నారని అన్నారు. ప్రజల నుంచి భారీ మద్దతు లభిస్తోందని, తేజస్వికి ప్రజా మద్దతు ఉందని తెలిపారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలుస్తారంటూ కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తనదైన శైలిలో స్పందించారు.
సోషలిస్టు అగ్రనేతలైన జయప్రకాశ్ నారాయణ్, రామ్‌మనోహర్ లోహియా, కర్పూరి ఠాకూర్ సిద్ధాంతాలకు నీతీష్ కుమార్ తూట్లు పొడిచారని ఖర్గే విమర్శించారు. మను స్మృతిని నమ్మే మహిళా వ్యతిరేకి బీజేపీతో చేతులు కలిపారని ఆరోపించారు.
రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపించేది ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కాదని ప్రియాంక విమర్శించారు. ప్రధాని, ఇతర కేంద్ర నాయకులు న్యూఢిల్లీ నుంచి రిమోట్ కంట్రోల్‌తో ప్రభుత్వాన్ని నడుపుతున్నారని అన్నారు.
బిహార్‌లోని సహర్సాలో సోమవారం జరిగిన ఎన్నికల ప్రచారసభలో ప్రధాని మాట్లాడుతూ, ప్రజలకు అందే ఎలాంటి సాయమైనా 'జంగిల్ రాజ్' నేతలు నిలిపేస్తారని, వారికి అభివృద్ధి పట్ల ఎలాంటి ఆలోచన ఉండదని చెప్పారు.