జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ జెండా ఎగరబోతోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్‌లో సెంటిమెంట్ రాజకీయాలు పనికిరావని విమర్శించారు సీఎం రేవంత్‌రెడ్డి. .
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారంనాడు 'నమో యాప్' ద్వారా పార్టీ మహిళా కార్యకర్తలతో మాట్లాడారు. ప్రజలు ఏమి కోరుకుంటున్నారో దగ్గరుండి తాను చూశానని, భారీ మెజారిటీతో ఎన్డీయే గెలుస్తుందని తాను చెప్పగలనని అన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కి ఒక్క ఛాన్స్ ఇవ్వాలని రేవంత్ రెడ్డి బతిమిలాడుతున్నారని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి కేటీఆర్.
మొకామా ప్రాంతంలో జేడీయూ అభ్యర్థి అనంత్ సింగ్ తరఫున లలన్ సింగ్ ఇటీవల ప్రచారంలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా పోలింగ్ రోజున విపక్ష నేతలను ఇళ్ల నుంచి బయటకు రానీయరాదని, ఇళ్లకు తాళాలు వేయాలని సూచించారు.
మరికొద్ది రోజుల్లో జరగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓటమి ఖాయమని బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ఓటమి భయం సీఎం రేవంత్ రెడ్డి పట్టుకుందని ఆయన పేర్కొన్నారు.
తేజస్విని సీఎం చేయాలని లాలూ, రాహుల్ గాంధీని ప్రధాని కావాలని సోనియాగాంధీ కలలు కంటున్నారని, అయితే వాళ్లు ఆ విషయం మరిచిపోవచ్చని, ఎందుకుంటే ఆ రెండు పోస్టులు ఖాళీగా లేవని అమిత్షా ఛలోక్తి విసిరారు. ఇక్కడ సీఎంగా నితీష్, అక్కడ పీఎంగా నరేంద్ర మోదీ ఉన్నారని చెప్పారు.
ఎన్నికలు వచ్చిన ప్రతిసారి మోదీపై వ్యక్తిగత విమర్శలు చేయడం కాంగ్రెస్ నేతలకు పరిపాటిగా మారిందని అమిత్షా అన్నారు. ఇలా చేసిన ప్రతిసారి బీజేపీకి ప్రజలు ఘనవిజయం కట్టబెట్టారని, ఈసారి కూడా అదే జరుగుతుందని, కాంగ్రెస్కు భంగపాటు తప్పదని అన్నారు.
అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ ఎన్నికల ప్రచారం చివరి రోజున ఒక సంచలనాత్మక ప్రకటన వచ్చింది. మహిళలకు ఏటా సంక్రాంతికి రూ.30 వేలు.. వాళ్ల బ్యాంకు ఖాతాల్లో జమచేస్తామని ఎన్నికల హామీ ఇచ్చారు..
ఎన్నికల ప్రచారం చాలా బాగా జరుగుతోందని, కూటమి విజయం సాధిస్తుందని లాలూ చెప్పారు. స్థానిక నేతలు కూడా బాగా పనిచేస్తున్నారని అన్నారు. ప్రజల నుంచి భారీ మద్దతు లభిస్తోందని, తేజస్వికి ప్రజా మద్దతు ఉందని తెలిపారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలుస్తారంటూ కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తనదైన శైలిలో స్పందించారు.