Share News

Naveen Yadav: జూబ్లీహిల్స్ ప్రజలు దొంగ సర్వేలను నమ్మరు

ABN , Publish Date - Nov 05 , 2025 | 01:30 PM

జూబ్లీహిల్స్ ప్రజలు దొంగ సర్వేలను నమ్మరని కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఏబీఎన్‌తో మాట్లాడారు. తనపై వస్తున్న విమర్శలను పట్టించుకోనని..

Naveen Yadav: జూబ్లీహిల్స్ ప్రజలు దొంగ సర్వేలను నమ్మరు
Naveen Yadav

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్ యాదవ్ ఏబీఎన్‌తో మాట్లాడారు. తాను చదువుకున్న వ్యక్తినని, ప్రజల కోసం నిజాయితీగా పని చేయాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. తనపై బీఆర్ఎస్‌ తప్పుడు ఆరోపణలు చేస్తోందని నవీన్‌ యాదవ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్‌ నేతలు తనపై తప్పుడు నిందలు వేస్తూ, అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు.


జూబ్లీహిల్స్ ప్రజలు దొంగ సర్వేలను నమ్మరని పేర్కొన్నారు. గతంలో తమ గల్లీకి ఎమ్మెల్యే కూడా రాలేదని, ఇప్పుడు సీఎం వస్తున్నారని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి తనను కుడి భుజంగా భావించడం తమ అదృష్టమని ఆయన పేర్కొన్నారు.


తన తండ్రి గతంలో కేసీఆర్‌కు సహాయం చేశారన్న నవీన్ యాదవ్, కేసీఆర్‌ తమ ఇంటికి వచ్చి సహాయం అడిగారని, శత్రువు ఇంటికి వచ్చినా సహాయం చేస్తామని నవీన్ యాదవ్ అన్నారు. 2018లో తనకు అవకాశం ఇవ్వకుండా బీఆర్ఎస్‌ అడ్డుకుందని ఆయన విమర్శించారు. తనపై వస్తున్న విమర్శలను పట్టించుకోనని, బీఆర్ఎస్‌ చేసిన అభివృద్ధి ఆధారంగా ఓట్లు అడగాలని ఆయన సూచించారు.


Also Read:

ధాన్యం కొనుగోలు డబ్బులు.. 24 గంటల్లోనే

డివైడర్‌పైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. బెంబేలెత్తిపోయిన ప్రయాణికులు

For More Latest News

Updated Date - Nov 05 , 2025 | 01:30 PM