తన ప్రమేయం లేని చోరీ కేసుల్లో పోలీసులు వద్ద తన పేరు ప్రస్తావిస్తున్నాడనే కోపంతో మనోజ్‌ను హత్య చేశానని హరిప్రసాద్ విచారణలో చెప్పినట్టు అదనపు ఎస్పీ రవిమనోహరాచారి తెలిపారు.
తన భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తునాన్నరన్న అనుమానంతో తోడుబుట్టిన తమ్ముడినే అన్న హత్య చేశాడు. ఘటన రాయచూరు జిల్లా సింధనూరు తాలూకాలోని వెంకటేశ్వర క్యాంప్‌లో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది.
‘ఏంటి..! మీ ఆయన నా జేబులో ఉన్నాడా? తెచ్చి ఇవ్వడానికి’ ఇదీ ఓ బాధితురాలు స్టేషన్‌కు వెళితే ఎస్ఐ(SI) నుంచి వచ్చిన హూంకరింపుతో కూడిన సమాధానం. ఇలా కొందరు పోలీస్ అధికారులు బెదిరింపు ధోరణిలో సమాధానం ఇస్తుంటే...మరికొందరు దివ్యాంగులు అనే కనికరం కూడా చూపడం లేదు.
తమిళనాడు రాష్ట్రం తిరుచ్చి పోలీసు క్వార్టర్స్‌లో ప్రైవేటు కంపెనీ ఉద్యోగి దారుణ హత్యకు గురయ్యారు. భీమానగర్ తూర్పు వీధిలో నివసిస్తున్న తామరై సెల్వన్ (27) అనే యువకుడికి యేడాది క్రితం వివాహం జరిగింది. ఆ యువకుడు ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. రోజూ బైకుపై ఆఫీసుకు వెళ్ళి సాయంత్రం తిరిగొస్తుంటాడు.
అమ్మేసిన ఇంట్లోనే అక్రమంగా ఉంటూ ఆ ఇంటి యజమాని కుమారుడినే నిర్బంధించి ఇనుపరాడ్లతో చితకబాదిన సంఘటన జూబ్లీహిల్స్‌లో సోమవారం జరిగింది. తీవ్రగాయాలపాలైన బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు చెట్టుకు చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి... రాజేంద్రనగర్ హనుమాన్‌నగర్‌కు చెందిన దుగ్గన్న కుమారుడు ధనూష్(22) మానస హిల్స్‌లోని ప్రెస్టీజ్ నిర్వణలో పనిచేస్తున్నాడు.
తన కుమారుడి మరణంపై అనుమానాలున్నాయని, డ్రగ్స్ ఓవర్ డోస్‌తో మృతి చెందిన మహ్మద్ అహ్మద్(26) తండ్రి మహ్మద్ మియా రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాతబస్తీ జహనుమాకు చెందిన మహ్మద్ అహ్మద్ రాజేంద్రనగర్ సర్కిల్ భవానీ కాలనీలోని కెన్వర్త్ అపార్ట్‌మెంట్స్‌లో రెండు నెలలుగా అద్దెకుంటున్నాడు.
తిరుపతి లో గురువారం అర్ధరాత్రి గంజాయి బ్యాచ్ వీరంగం చేసింది. సింగాలగుంటలో దాదాపు ఐదారు గంటల పాటు ఆరుగురు యువకులు, విద్యార్థులు హల్చల్ చేశారు. కనకభూషణ లేఅవుట్లో ఆరు కార్లు అద్దాలు ధ్వంసం చేశారు. పక్కనే వున్న విద్యుత్ శాఖ సబ్‌స్టేషన్ కార్యాలయ కిటికీ అద్దాలు, తలుపులు ధ్వంసం చేశారు.
జైపూర్ నగరంలోని ఓ ప్రైవేటు స్కూల్ బిల్డింగ్ పైనుంచి దూకి తొమ్మిదేళ్ల బాలిక అమైరా (12) ఆత్మహత్య చేసుకున్న ఘటన జరిగిన విషయం తెలిసిందే. తాజాగా పాఠశాలలో తోటి విద్యార్థుల వేధింపుల వల్లే తమ కన్నబిడ్డ సూసైడ్ చేసుకుందని ఆ బాలిక తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు తన కూతురు మాట్లాడిన ఆడియోను మీడియాతో పంచుకున్నారు.
హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న ఓ 17 ఏళ్ల బాలికను అదే కళాశాలలో సీనియర్‌గా చదువుకుంటున్న యువకుడు ప్రేమ పేరుతో తల్లిని చేశాడు. ఆ బాలిక గురువారం ఆసుపత్రిలో పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. కడపలోని వసతి గృహంలో ఉంటూ కాలేజీకి వెళ్లి తిరిగి హాస్టల్‌కు వస్తుండేది.