ఒకే కుటుంబానికి చెందిన 11 మందికి చైనాలో మరణశిక్ష
ABN , Publish Date - Jan 30 , 2026 | 03:26 AM
మయన్మార్ కేంద్రంగా పెద్దఎత్తున సైబర్ నేరాలు, బెట్టింగ్‌లు, హత్యలు, మోసాలకు పాల్పడుతున్న ఒకే కుటుంబానికి చెందిన 11 మందికి చైనా మరణశిక్షను అమలుచేసింది.
బ్యాంకాక్, జనవరి 29: మయన్మార్ కేంద్రంగా పెద్దఎత్తున సైబర్ నేరాలు, బెట్టింగ్‌లు, హత్యలు, మోసాలకు పాల్పడుతున్న ఒకే కుటుంబానికి చెందిన 11 మందికి చైనా మరణశిక్షను అమలుచేసింది. ఈ గ్యాంగ్ కారణంగా 14 మంది చైనా పౌరులు మృతిచెందగా, మొత్తం స్కామ్ లావాదేవీల విలువ రూ.9200 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు తెలిపారు. వెంజౌ నగరంలోని ఇంటర్మీడియట్ పీపుల్స్ కోర్టు ఈ మరణశిక్షను అమలు చేస్తున్నట్లు గురువారం ప్రకటించింది. ఈ కేసులో నిందితులకు సెప్టెంబరులోనే మరణశిక్ష విధించారు.