ప్రేమ విఫలమై.. ప్రైవేటు ఉద్యోగి ఆత్మహత్య
ABN , Publish Date - Jan 27 , 2026 | 08:45 AM
ప్రేమ విఫలమై ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డ విషాద సంఘటన నగరంలోని అత్తాపూర్ సాయినగర్‌లో చోటుచేసుకుంది. ఆదిత్యరెడ్డి అనే ప్రైవేటు ఉద్యోగి పనిచేస్తున్నాడు. అయితే.. అతను ఓ యువతిని ప్రేమించాడు. ఆమె పెళ్లికి నిరాకరించడంతో.. ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
హైదరాబాద్: ప్రేమ విఫలమై ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల ప్రకారం.. అత్తాపూర్ సాయినగర్(Attapur Sainagar)కు చెందిన యాకిరెడ్డి కుమారుడు ఆదిత్యరెడ్డి (29) ప్రైవేటు ఉద్యోగి. ఇతను ఏపీకి చెందిన శంషాబాద్‌లో నివాసం ఉంటున్న ఓ యువతిని ప్రేమించాడు. పెళ్లి కూడా చేసుకుందామనుకున్నారు. అయితే ప్రస్తుతం ఆ యువతి అతనితో పెళ్లికి ఇష్టపడటం లేదు. దీంతో మనస్తాపానికి గురైన ఆదిత్య ఆదివారం సాయంత్రం పైన గదిలో పడుకుంటానని, సోమవారం పరీక్ష ఉందని రాత్రి 12.30కు నిద్రలేపాలని తండ్రికి చెప్పాడు.
ఆదివారం రాత్రి 12.30కు తండ్రి కుమారుడిని ఫోన్ చేసి లేపడానికి ప్రయత్నించగా అతను ఫోన్ తీయలేదు. పైకి వెళ్లి చూడగా తలుపు లోపల గడియ పెట్టుకుని ఉన్నాడు. కిందకు వచ్చి భార్యకు చెప్పి సుత్తితో తలుపులు పగులగొట్టి చూడగా ఆదిత్యరెడ్డి లుంగీతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించాడు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. యాకిరెడ్డి ఫిర్యాదు మేరకు అత్తాపూర్ ఎస్‌ఐ వెంకటేశ్ దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
హింసను ప్రశ్నించినా బెదిరింపులే!
Read Latest Telangana News and National News