Share News

గుమస్తా నుంచి రూ.19.92 లక్షల దోపిడీ

ABN , Publish Date - Jan 25 , 2026 | 03:40 AM

పోలీస్‌ అని రాసి ఉన్న వాహనంలో వచ్చిన కొందరు వ్యక్తులు ఓ బంగారం దుకాణంలో పనిచేసే గుమస్తాను కిడ్నాప్‌ చేసి అతడి నుంచి రూ.19.92 లక్షలు దోపిడీ చేశారు.

గుమస్తా నుంచి రూ.19.92 లక్షల దోపిడీ

  • నిజామాబాద్‌లో ఘటన

నిజామాబాద్‌, జనవరి 24 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): పోలీస్‌ అని రాసి ఉన్న వాహనంలో వచ్చిన కొందరు వ్యక్తులు ఓ బంగారం దుకాణంలో పనిచేసే గుమస్తాను కిడ్నాప్‌ చేసి అతడి నుంచి రూ.19.92 లక్షలు దోపిడీ చేశారు. ఈ ఘటన నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో జరిగింది. నగరంలోని గాంధీగంజ్‌లో వెంకటేశ్వర జ్యూవెల్లర్‌ దుకాణంలో పనిచేసే గంగాధర్‌ అనే గుమస్తాకు షాప్‌ యజమాని అనిల్‌ పాటిల్‌ శుక్రవారం రూ.19.92 లక్షలు ఇచ్చి బ్యాంకులో జమచేయాలని చెప్పారు. అందుకోసం వెళ్తున్న గంగాధర్‌ను పోలీస్‌ అనే పేరుతో ఉన్న వాహనంలో వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేశారు. అతడి దగ్గర ఉన్న డబ్బులు తీసుకుని రూ.వెయ్యి ఇచ్చి నిర్మల్‌ జిల్లా బాసర బ్రిడ్జిపైన వదిలేసి వెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. మూడు బృందాలతో నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఈ దోపిడీఘటన డ్రామానా లేక వాస్తవమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Jan 25 , 2026 | 03:40 AM