అనుమానం పెనుభూతమైంది.. భార్యపై అనుమానం పెంచుకున్న ఓ వ్యక్తి.. తన ఇద్దరు పిల్లలను హతమార్చి, తనూ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన తిరువణ్ణామలై జిల్లా ఆరణి సమీపం తెల్లూరు గ్రామంలో చోటుచేసుకుంది.
తాళం వేసి ఉన్న ఇంటి కిటికీ గ్రిల్ తొలగించి లోపలకు వెళ్లిన దుండగులు భారీ చోరీకి పాల్పడ్డారు. నాగోల్ పోలీసుల వివరాల ప్రకారం.. నాగోల్ సాయినగర్‌కాలనీ రోడ్డు నంబర్.1లో భాస్కర్, ప్రమీల దంపతులు నివాసముంటున్నారు. గత నెల 17న ఇంటికి తాళం వేసి నగరంలో ఉండే ప్రమీల సోదరుడు శ్రీనివాస్‌కు చెప్పి అమెరికాకు వెళ్లారు.
పీఎం కిసాన్, ఆర్‌టీఓ చలాన్ పేర్లతో ఏపీకే లింక్‌లను పంపి ఇద్దరు నగరవాసులను బురిడీ కొట్టించిన సైబర్ నేరగాళ్లు రూ.2.47 లక్షలు కాజేశారు. దోమలగూడ ప్రాంతానికి చెందిన వ్యక్తి (29) ఫోన్‌కు ‘పీఎం కిసాన్’ పేరుతో ఏపీకే లింక్ పంపి దరఖాస్తు చేసుకోవాల్సిందిగా సూచించారు.
వివాహానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.. వేడుకలకు బంధువులు అందరూ చేరుకున్నారు. గుండెపోటుతో వధువు కన్ను యూయడంతో ఆ ఇంట్లో విషాదం నెలకొంది. జీవితంలో కొత్త అధ్యాయానికి అడుగులు వేడయానికి సిద్ధమైన యువతి జీవితం అకస్మికంగా ముగిసిన సంఘటన చిక్కమగళూరు జిల్లా అజ్జంపుర తాలూకాలో గురువారం చోటు చేసుకుంది.
వివాహం చేసుకునేందుకు ఇష్టం లేని దంతవైద్యురాలు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కళ్లకుర్చి జిల్లాలో చోటుచేసుకుంది. తిరుకోవిలూర్ సందైపేట సుబ్రమణ్యనగర్ ప్రాంతానికి చెందిన కృష్ణన్ కుమార్తె అమృతవర్షిణి (24) దంత వైద్యురాలిగా పనిచేస్తోంది.
అతివేగం ఓ యువకుడి ప్రాణాలు బలికొంది. డ్యూటీకి వెళుతున్నానని చెప్పి బయలు దేరిన యువకుడు అరగంటలోనే మృత్యుఒడిలోకి చేరుకున్నాడు. బాలానగర్ సీఐ టి.నర్సింహారాజు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మైసమ్మగూడలో జరిగింది. పేట్‌బషీరాబాద్ సీఐ విజయవర్ధన్ తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా, దామరచర్ల కృష్ణారావు కాలనీకి చెందిన పూర్ణచందర్‌రావు రెండో కుమారుడు పి. మల్లికార్జున్(19) మల్లారెడ్డి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఆర్‌ఐటీ)లో బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతూ మైసమ్మగూడలోని సిరి డీలక్స్ వసతిగృహంలో ఉంటున్నాడు.
తిరుచానూరు.. తిరుపతి వెస్ట్ రైల్వే స్టేషన్ మధ్య తరచూ ఎక్కడో ఒక చోట రైలు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఎక్స్‌ప్రెస్ రైళ్లలో కిక్కిరిసిన ప్రయాణికుల్లో ఉంటున్న జనరల్ బోగీల్లో ఫుట్‌పాత్‌పై ప్రమాదకర పరిస్థితుల్లో కూర్చున్న వారిలో పలువురు ప్రమాదవశాత్తు జారి పడి మృతి చెందుతున్నారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బుల్లెట్ కలకలం రేపింది. ఆర్జీఐఏ ఔట్‌పోస్టు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం కోల్‌కతాకు చెందిన విశాల్ 6ఈ6709 విమానంలో కోల్‌కత్తా నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాడు.
కొప్పళ జిల్లాలో ఇద్దరు పిల్లలను హతమార్చి తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. సోమవారం కుకనూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో బెణకల్ గ్రామంలో లక్ష్మి భజంత్రి (30), పిల్లలు రమేశ్ (3), జానవి(2)లను హతమార్చి తర్వాత ఆత్మహత్య చేసుకున్నారు.