Share News

Hyderabad: అమ్మో.. రూ.7.75 లక్షలు కొట్టేశారుగా.. ఏం జరిగిందో తెలిస్తే..

ABN , Publish Date - Jan 20 , 2026 | 08:05 AM

నగరానికి చెందిన ఓ వ్యక్తి సైబర్ మోసగాడి చేతిలో బలయ్యాడు. మొత్తం రూ.7.75 లక్షలు పొగొట్టుకున్నాడు. సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన తక్కువగా ఉండడంతో ప్రతిరోజు, ఎవరోఒకరు, ఎక్కడో ఓచోట మోసపోతూనే ఉన్నారు. తాజాగా ఓ వ్యక్తి సైబర్ మోసానికి గురయ్యాడు. వివరాలిలా ఉన్నాయి.

Hyderabad: అమ్మో.. రూ.7.75 లక్షలు కొట్టేశారుగా.. ఏం జరిగిందో తెలిస్తే..

- లాటరీ పేరుతో సైబర్‌ మోసం

- రూ.7.75 లక్షలు కాజేత

హైదరాబాద్‌ సిటీ: కేరళ ఆన్‌లైన్‌ లాటరీ పేరుతో నగరవాసిని మోసం చేసిన సైబర్‌ క్రిమినల్స్‌ అతడి నుంచి రూ.7.78 లక్షలు వసూలు చేశారు. బడంగ్‌పేట్‌(Badangpet)కు చెందిన వ్యక్తి (43) ఫేస్‌బుక్‌లో కేరళ లాటరీ(Kerala Lottery)కి చెందిన వీడియోను చూసి అందులో సూచించిన లింక్‌ ద్వారా ఓ వ్యక్తిని ఫోన్‌ ద్వారా సంప్రదించాడు. ఫోన్‌లో మాట్లాడిన అతడు లాటరీలో పాల్గొనేందుకు లింక్‌ పంపాడు. ఈ లింక్‌ తెరిచిన బాధితుడికి ‘మెగా కేరళ లాటరీ’ పేరుతో అప్లికేషన్‌ కనిపించింది. అనంతరం చిన్న మొత్తాల్లో లాటరీ టికెట్ల కొనుగోలు చేశాడు.


city3.jpg

వారు సూచించిన బ్యాంకు ఖాతాలకు డబ్బు పంపేవాడు. లాటరీ టికెట్‌కు డబ్బులు వచ్చాయని చూపుతుండటంతో నమ్మిన బాధితుడు సన్నిహితులు, బంధువుల నుంచి అప్పు తెచ్చి మరీ రెండు నెలల పాటు లాటరీ టికెట్ల కొనుగోలు చేశాడు. ఇలా మొత్తం రూ.7.78 లక్షలు వెచ్చించాడు. లాటరీలో డబ్బు వచ్చినట్లు చూపినా విత్‌డ్రా ఆప్షన్‌ లేకపోవడం, బ్యాంకు ఖాతా ఫ్రీజ్‌ కావడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


ఈ వార్తలు కూడా చదవండి.

భారీ పెట్టుబడుల సమీకరణే లక్ష్యంగా..

ఏపీలో స్విస్‌ పెట్టుబడులకు సహకరించండి

Read Latest Telangana News and National News

Updated Date - Jan 20 , 2026 | 08:05 AM