Share News

Gurugram Doctor: స్విగ్గీ డెలివరీ ఏజెంట్‌ను కారుతో ఢీకొట్టిన ప్రభుత్వ డాక్టర్! రోడ్డుపై రద్దీ పెరిగిందని..

ABN , Publish Date - Jan 20 , 2026 | 12:02 PM

డెలివరీ ఏజెంట్ల కారణంగా రోడ్డుపై రద్దీ పెరిగిందన్న కోపంతో ఓ ప్రభుత్వ డాక్టర్ రెచ్చిపోయాడు. తన కారుతో ఓ డెలివరీ ఏజెంట్‌ను ఢీకొట్టాడు. గురుగ్రామ్‌లో ఈ ఘటన వెలుగు చూసింది.

Gurugram Doctor: స్విగ్గీ డెలివరీ ఏజెంట్‌ను కారుతో ఢీకొట్టిన ప్రభుత్వ డాక్టర్! రోడ్డుపై రద్దీ పెరిగిందని..
Govt doctor arrested in Gurugram

ఇంటర్నెట్ డెస్క్: గురుగ్రామ్ (హర్యానా) కు చెందిన ఓ ప్రభుత్వ డాక్టర్ అరాచకం సృష్టించాడు. మద్యం మత్తులో అతడు తన ఎస్‌యూవీ కారుతో ఓ స్విగ్గీ డెలివరీ ఏజెంట్ వాహనాన్ని ఢీకొట్టాడు. డెలివరీ ఏజెంట్ అభ్యంతరం చెప్పినందుకు మరోసారి అతడి వాహనాన్ని తన కారుతో ఢీకొట్టే ప్రయత్నం చేశాడు. హయత్‌పురలోని సెక్టర్ 93లో సోమవారం ఈ ఘటన వెలుగుచూసింది. నిందితుడిని నవీన్ యాదవ్‌గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో గాయాల పాలైన డెలివరీ ఏజెంట్ టింకూ పన్వర్ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు (Swiggy delivery agent hit Govt Doc in Gurugram Viral Video).

నిందితుడిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. అతడు దౌలతాబాద్‌లోని ఓ ప్రాథమిక వైద్య కేంద్రంలో పనిచేస్తున్నాడని చెప్పారు. పోలీసులు తెలిపిన దాని ప్రకారం, ఆ ప్రాంతంలో స్విగ్గీ వేర్‌హౌస్ ఉంది. దీంతో, నిత్యం డెలివరీ ఏజెంట్ల రాకపోకలతో వేర్‌హౌస్ ఉన్న వీధిలో నిత్యం రద్దీగా ఉంటుంది. ఈ తీరుపై అసంతృప్తితో ఉన్న డాక్టర్ నవీన్.. ఆ డెలివరీ ఏజెంట్‌పై తన కోపాన్నంతా వెళ్లగక్కాడు. అతడి వాహనాన్ని తన కారుతో ఢీకొట్టాడు. బాధిత డెలివరీ ఏజెంట్ అభ్యంతరం వ్యక్తం చేయగా.. నవీన్ యాదవ్ కారులో వెనక్కొచ్చి మళ్లీ ఢీకొట్టాడు. తనకు అభ్యంతరం చెప్పిన ఇతర డెలివరీ ఏజెంట్లపై కూడా కారును పోనిచ్చేందుకు నిందితుడు ప్రయత్నించాడు.


ఇందుకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఘటన అనంతరం డ్రైవర్ పారిపోయాడు. నిందితుడిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసిన పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు.


ఇవీ చదవండి:

నా బిడ్డను వెలేశారు.. ఓ తండ్రి పోస్టు నెట్టింట వైరల్

వందే భారత్ స్లీపర్‌లో షాకింగ్ సీన్.. మీరెందుకు మారరు బ్రో?

Updated Date - Jan 20 , 2026 | 12:45 PM