సెమీకండక్టర్ల రంగంలో దీర్ఘకాలిక పెట్టుబడులు భారత్ భవిష్యత్తును ప్రభావితం చేస్తాయని టాటా సన్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్ అభిప్రాయపడ్డారు.
వరుస నష్టాలతో ఇబ్బందులు ఎదుర్కొన్న దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం తిరిగి పుంజుకున్నాయి. కనిష్ఠాల వద్ద కొనుగోళ్ల మద్దతు, ఐటీ షేర్లలో ర్యాలీ, మార్కెట్లో ఒడిదొడుకులను సూచించే ఇండియా విఐక్స్ తగ్గడం సూచీలకు ఊతమిచ్చాయి.
దేశంలో బంగారం ధరల పతనం కొనసాగుతోంది. డాలర్ బలపడటంతో పసిడి ధరలు తగ్గుతున్నాయి. నిన్న ఓ మోస్తరు స్థాయిలో తగ్గిన ధరలు నేడు ( అక్టోబర్ 13) కూడా తిరోగమనంలో పయనిస్తున్నాయి.
అమెరికా-ఇరాన్ యుద్ధ ప్రభావం, పెరుగుతున్న చమురు ధరలు, అంతర్జాతీయ అనిశ్చితి కొనసాగుతున్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ బలమైన వృద్ధిని నమోదు చేయనుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) అంచనా వేసింది.
దేశీయంగా బంగారం ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. మంగళవారం ఉదయం ఆరు గంటల సమయంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
స్థానిక పేమెంట్ టెక్నాలజీ సేవల సంస్థ వియోనా ఫిన్టెక్ తన సేవలను ఆఫ్రికాలోని జింబాబ్వే దేశానికీ విస్తరిస్తోంది.
సెప్టెంబరులో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ పథకాల్లోకి నికరంగా రూ.38,306 కోట్ల పెట్టుబడులు వచ్చాయని, అంతక్రితం నెలలో నమోదైన రూ.29,329 కోట్ల ఇన్వెస్ట్ మెంట్లతో పోలిస్తే 31 శాతం అధికమని అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (యాంఫీ) సోమవారం వెల్లడించింది.
దేశంలోనే అతిపెద్ద ఐటీ సర్వీసుల కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) కొత్తగా నియమించుకునే ఉద్యోగుల విషయంలో తన పంథాను మార్చుకుంటోంది
ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికానికి రూ.5,132 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ప్రకటించింది.
కృత్రిమ మేధ(ఏఐ)తో ఉద్యోగాలకు ముంచుకొస్తున్న ముప్పుపై అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ఆ సంస్థ ఎండీ క్రిస్టాలినా జార్జీవా.. ఏఐని ‘నిదానంగా ముంచుకొస్తున్న సునామీ’గా అభివర్ణించారు.