Share News

మార్కెట్లో నిస్తేజం..

ABN , Publish Date - Feb 12 , 2026 | 05:37 AM

స్టాక్‌ మార్కెట్లో మూడు రోజుల వరుస ర్యాలీకి తెరపడింది. బుధవారం ట్రేడింగ్‌లో స్తబ్దత కారణంగా పరిమిత శ్రేణిలో కదలాడిన సూచీలు చివరికి మిశ్రమంగా...

మార్కెట్లో నిస్తేజం..

మిశ్రమంగా ముగిసిన సూచీలు

ముంబై: స్టాక్‌ మార్కెట్లో మూడు రోజుల వరుస ర్యాలీకి తెరపడింది. బుధవారం ట్రేడింగ్‌లో స్తబ్దత కారణంగా పరిమిత శ్రేణిలో కదలాడిన సూచీలు చివరికి మిశ్రమంగా ముగిశాయి. సెన్సెక్స్‌ 40.28 పాయింట్ల నష్టంతో 84,233.64 వద్ద ముగిసింది. నిఫ్టీ మాత్రం 18.70 పాయింట్ల వృద్ధితో 25,953.85 వద్ద స్థిరపడింది.

  • ప్రభుత్వ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ దేశంలోని అత్యంత విలువైన లిస్టెడ్‌ కంపెనీల జాబితాలో ఐటీ దిగ్గజం టీసీఎస్‌ను వెనక్కి నెట్టి నాలుగో స్థానానికి చేరుకుంది. బీఎస్‌ఈలో ఎస్‌బీఐ షేరు బుధవారం 3.40ు పెరిగి రూ.1,183 వద్దకు చేరుకుంది. దాంతో బ్యాంక్‌ మార్కెట్‌ విలువ రూ.10.92 లక్షల కోట్లకు ఎగబాకింది.

ఇవి కూడా చదవండి..

దేశాన్ని అమ్మేశారు.. అమెరికాతో డ్రేల్‌ డీల్‌పై రాహుల్ గాంధీ

మన డేటా రక్షణకు చర్యలేవీ.. కేంద్రంపై రాహుల్‌‌ ప్రశ్నల వర్షం

Updated Date - Feb 12 , 2026 | 05:37 AM