Share News

బ్యాంకుల మిస్‌సెల్లింగ్‌కు చెక్‌

ABN , Publish Date - Feb 12 , 2026 | 05:53 AM

బ్యాంకుల మిస్‌సెల్లింగ్‌కు (కస్టమర్లకు అవసరం లేకున్నా తమ ఆర్థిక సాధనాలు లేదా సేవలను అంటగట్టడం) చెక్‌ పెట్టేందుకు ఆర్‌బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకులు ఏదేని ఆర్థిక...

బ్యాంకుల మిస్‌సెల్లింగ్‌కు చెక్‌

  • ఈ విధానాలకు బాటలు వేసే ప్రోత్సాహకాలపై నిషేధం

  • ఆర్‌బీఐ మార్గదర్శకాల సవరణ ముసాయిదా విడుదల

ముంబై: బ్యాంకుల మిస్‌సెల్లింగ్‌కు (కస్టమర్లకు అవసరం లేకున్నా తమ ఆర్థిక సాధనాలు లేదా సేవలను అంటగట్టడం) చెక్‌ పెట్టేందుకు ఆర్‌బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకులు ఏదేని ఆర్థిక సాధనం/ఉత్పత్తి/పాలసీ లేదా సేవల మిస్‌సెల్లింగ్‌కు దారితీసే ప్రోత్సాహకాలను ప్రకటించరాదని ప్రతిపాదించింది. కస్టమర్ల నుంచి సమ్మతి లభించాకే బ్యాంక్‌లు వారిని ఫోన్‌ ద్వారా సంప్రదించాలని, పనివేళ్లలో వారికి కాల్‌ చేయరాదని కూడా నిర్దేశించింది. తన నియంత్రణ సంస్థల ఆర్థిక ఉత్పత్తులు, సేవల ప్రచారం, మార్కెటింగ్‌, విక్రయాలకు సంబంధించిన మార్గదర్శకాల సవరణ ముసాయిదాను ఆర్‌బీఐ బుధవారం విడుదల చేసింది. అందులోని మరిన్ని ముఖ్యాంశాలు..

  • బ్యాంక్‌ తన ఆర్థిక సాధనం లేదా సేవలతో థర్డ్‌ పార్టీ ఉత్పత్తులను కలిపి విక్రయించడానికి వీల్లేదు. అంతేకాదు, కస్టమరు తనకు నచ్చిన కంపెనీ ఆర్థిక సాధనం/ఉత్పత్తి లేదా సేవను ఎంచుకునే అవకాశాన్ని కల్పించాలి.

  • ఒకవేళ మిస్‌సెల్లింగ్‌ జరిగితే, కస్టమరు చెల్లించిన మొత్తం సొమ్మును వాపసు (రిఫండ్‌) చేయాలి. తద్వారా కస్టమరుకు కలిగిన నష్టానికి కూడా పరిహారం చెల్లించాలి.

  • ఈ సవరణ ముసాయిదాలోని ప్రతిపాదనలపై మార్చి 4 లోగా అభిప్రాయాలు తెలుపాల్సిందిగా ఆర్‌బీఐ ప్రజలను కోరింది. ఇవి ఈ జూలై 1 నుంచి అమలులోకి రానున్నాయి.

ఇవి కూడా చదవండి..

దేశాన్ని అమ్మేశారు.. అమెరికాతో డ్రేల్‌ డీల్‌పై రాహుల్ గాంధీ

మన డేటా రక్షణకు చర్యలేవీ.. కేంద్రంపై రాహుల్‌‌ ప్రశ్నల వర్షం

Updated Date - Feb 12 , 2026 | 05:53 AM