దివీస్‌కు లేబర్ కోడ్ ఎఫెక్ట్
ABN , Publish Date - Feb 12 , 2026 | 05:58 AM
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికంలో హైదరాబాద్‌కు చెందిన దివీస్ లేబొరేటరీస్...
క్యూ3లో రూ.583 కోట్లకు తగ్గిన లాభం
కంపెనీ ఆదాయంలో 12 శాతం వృద్ధి
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికంలో హైదరాబాద్‌కు చెందిన దివీస్ లేబొరేటరీస్ రూ.583 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి ఆర్జించిన రూ.589 కోట్ల లాభంతో పోలిస్తే స్వల్పంగా తగ్గింది. అంతేకాదు, రెండో త్రైమాసికంలో నమోదైన రూ.696 కోట్ల లాభంతో పోలిస్తే 15.4ు తగ్గింది. కొత్త లేబర్ కోడ్స్ అమలు కోసం సమీక్షా త్రైమాసికంలో ఏక కాల ఖర్చుల కింద రూ.74 కోట్లు కేటాయించడంతో కంపెనీ లాభాలకు గండి పడింది. ఈ క్యూ3లో కంపెనీ మొత్తం ఆదాయం మాత్రం వార్షిక ప్రాతిపదికన 12.11ు వృద్ధితో రూ.2,692 కోట్లకు పెరిగింది.
ఇవి కూడా చదవండి..
దేశాన్ని అమ్మేశారు.. అమెరికాతో డ్రేల్ డీల్‌పై రాహుల్ గాంధీ
మన డేటా రక్షణకు చర్యలేవీ.. కేంద్రంపై రాహుల్ ప్రశ్నల వర్షం