అమర రాజా లాభం రూ.140 కోట్లు
ABN , Publish Date - Feb 12 , 2026 | 06:00 AM
వర్తమాన ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో అమర రాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ లిమిటెడ్ ఏకీకృత నికర లాభం రూ.140 కోట్ల కు పరిమితమైంది. గత ఆర్థిక...
4.2% వృద్ధితో రూ.3,410 కోట్లకు ఆదాయం
హైదరాబాద్(ఆంధ్రజ్యోతి బిజినెస్): వర్తమాన ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో అమర రాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ లిమిటెడ్ ఏకీకృత నికర లాభం రూ.140 కోట్ల కు పరిమితమైంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి నమోదైన రూ.298 కోట్లతో పోలిస్తే లాభం 53ు క్షీణించింది. నిర్వహణ లాభాల మార్జిన్లు తగ్గడంతోపాటు ఖర్చులు పెరగడం ఇందుకు కారణం. ఈ క్యూ3లో కంపెనీ ఎబిటా మార్జిన్ 11 శాతానికి తగ్గగా.. మొత్తం ఖర్చులు రూ.3,203 కోట్లకు ఎగబాకాయి. కాగా, ఈ క్యూ3లో కంపెనీ ఆదాయం 4.2ు వృద్ధి చెంది రూ.3,410 కోట్లకు పెరిగింది. 2024-25లో ఇదే కాలానికి ఆదాయం రూ.3,272 కోట్లుగా నమోదైంది. మూడు త్రైమాసికాలకుగాను అమర రాజా ఏకీకృత ఆదాయం రూ.10,278 కోట్లకు పెరగగా.. ఏకీకృత నికర లాభం రూ.581.44 కోట్లకు తగ్గింది. బీఎ్‌సఈలో షేరు ధర బుధవారం 0.47ు పెరిగి రూ.911.25 వద్ద ముగిసింది.
అమెరికాలో అనుబంధ సంస్థ ఏర్పాటు
అంతర్జాతీయంగా వ్యాపార విస్తరణతోపాటు కస్టమర్ సర్వీస్ సామర్థ్యాన్ని బలోపే తం చేసేందుకు ‘ఏఆర్ ఈ అండ్ ఎం యూఎస్ ఇంక్’ పేరుతో అమెరికాలో పూర్తి అనుబంధ సంస్థ ఏర్పాటుకు బుధవారం బోర్డు ఆమోదం తెలిపిందని అమర రాజా స్టాక్ ఎక్స్ఛేంజ్‌లకు వెల్లడించింది. వచ్చే 3-6 నెలల్లో ఈ అనుబంధ సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు, ఇందుకోసం 50 లక్షల డాలర్ల (రూ.45 కోట్ల పైమాటే) వరకు పెట్టుబడులు పెట్టనున్నట్లు సంస్థ వెల్లడించింది.
ఇవి కూడా చదవండి..
దేశాన్ని అమ్మేశారు.. అమెరికాతో డ్రేల్ డీల్‌పై రాహుల్ గాంధీ
మన డేటా రక్షణకు చర్యలేవీ.. కేంద్రంపై రాహుల్ ప్రశ్నల వర్షం