ఇటీవల కురిసిన భారీ వర్షాలకు, వరదలకు కొంప కోల్లేరైంది. బెజవాడ బుడమేరైంది్ అని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక విధానాలను మాను కోవాలని కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు టీవీ లక్ష్మణస్వామి అన్నారు. స్థానిక గాంధీబొమ్మ సెంటర్‌లో సేవ్ ఇండి యా-సేవ్ అగ్రికల్చర్ అంటూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన తెలిపారు.
పల్నాడు జిల్లా, ముప్పాళ్ల మండం, నార్నెపాడు భీమేశ్వ రాలయం బయట క్రీ.శ 12వ శతాబ్ది శాసనం నిర్లక్ష్యానికి గురవడంపై పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం 12వ పీఆర్సీని నేరుగా ప్రకటించాలని ఫోర్టో రాష్ట్ర చైర్మన హరికృష్ణ డిమాండ్ చేశారు. బుధవారం రాత్రి ఉపాధ్యాయభవనలో ఆ సంఘం జిల్లా నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు
అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని నందలపాడుకు చెందిన టీడీపీ కార్యకర్త లాల్‌బాషా(23)ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. డాబాపై నిద్రిస్తున్న అతనిని సోమవారం తెల్లవారుజామున కత్తులతో నరికేశారని డీఎస్పీ జనార్దన్‌నాయుడు తెలిపారు.
‘మీకు ఎలాంటి విద్యార్హత లేకపోయినా ఫర్వాలేదు. కెనడాలో మీకు ఉద్యోగం ఇప్పిస్తా. నెలకు రెండున్నర లక్షల జీతం. దీనికోసం మీరు చేయాల్సింది.. అక్కడ మీరు సంపాదించబోయే రెండు నెలల జీతాన్ని ముందుగా ఇక్కడ పెట్టుబడి పెట్టడమే’’ అంటూ ఓ కన్సల్టెన్సీ నిరుద్యోగులు, చిరు వ్యాపారులు, చేతి వృత్తుల వారికి ఆశలు కల్పించింది. కెనడా డాలర్లను ఆశగా చూపి వారి వద్ద నుంచి రూ.కోట్లలో వసూలు చేసి వారందరికీ కుచ్చుటోపి పెట్టింది. విజయవాడలోని ఓ కన్సల్టెన్సీ నిర్వాహకురాలి వలలో చిక్కుకున్న బాధితులు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. ఆలస్యంగా వెలుగు చూసిన మాయలాడి నిర్వాకానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
గ్రామాల్లో నిర్వహిస్తున్న ఉచిత పశువైద్య శిబిరాలను సద్వినియోగం చేసు కోవాలని పశు సంవర్థక శాఖ జేడీ డాక్టర్ వి.జయరాజు కోరారు. స్థానిక పశు వైద్య కేంద్రంలో వైద్య శిబిరాన్ని సోమవారం పరిశీలించారు.
కనగానపల్లి మండలంలోని మామిళ్లపల్లిలోని దోబీఘాట్‌కు నీటిని సరఫరా చేసే పైపులైనను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయంలో మాజీ మంత్రి పరిటాల సునీత రజకుల కోసం గ్రామ శివారులోని తలిపిరి వద్ద రూ.7 లక్షలతో దోబీఘాట్ నిర్మించారు.
తిరుపతి కేటీరోడ్డులోని ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల హెల్ప్‌లైన్ కేంద్రంలో సోమవారం నుంచి వచ్చేనెల 3వతేదీ వరకు పాలిసెట్-2కే24 కౌన్సెలింగ్‌కు సంబంధించిన ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభం కానుందని ప్రిన్సిపాల్, కోఆర్డినేటర్ డాక్టర్ వై.ద్వారకనాథరెడ్డి తెలిపారు.
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలంతా వివాదాలకు దూరంగా ఉండి, ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ.జి.కృష్ణకాంత్ అన్నారు.