ప్రభుత్వం 12వ పీఆర్సీ ప్రకటించాలి : ఫోర్టో
ABN , Publish Date - Jun 26 , 2024 | 11:52 PM
రాష్ట్ర ప్రభుత్వం 12వ పీఆర్సీని నేరుగా ప్రకటించాలని ఫోర్టో రాష్ట్ర చైర్మన హరికృష్ణ డిమాండ్ చేశారు. బుధవారం రాత్రి ఉపాధ్యాయభవనలో ఆ సంఘం జిల్లా నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు
అనంతపురం విద్య, జూన 26: రాష్ట్ర ప్రభుత్వం 12వ పీఆర్సీని నేరుగా ప్రకటించాలని ఫోర్టో రాష్ట్ర చైర్మన హరికృష్ణ డిమాండ్ చేశారు. బుధవారం రాత్రి ఉపాధ్యాయభవనలో ఆ సంఘం జిల్లా నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో ప్రభుత్వం పీఆర్సీ కమిషన వేసి సిబ్బందిని నియమించకుండా కాలయాపన చేసిందని మండిపడ్డారు.
ఇప్పటికే ఏడాదికాలం ముగిసిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఎలాంటి కమిషన్లు, కమిటీలు లేకుండా ఉద్యోగులు, ఉపాధ్యాయులకు నేరుగా పీఆర్సీ ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా పెండింగ్‌లో ఉన్న బకాయిలు అన్నింటినీ వెంటనే చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పలు సంఘాల నాయకకులు ఆదిశేషయ్య, వేణుగోపాల్, వెంకటేషులు, నాగేంద్ర, శ్రీనివాసులు, కేశవ్, పెద్దన్న, నాగేంద్ర, నాగరాజు, కిష్టప్ప పాల్గొన్నారు.