నేటినుంచి ‘పాలిసెట్’ ధ్రువపత్రాల పరిశీలన
ABN , Publish Date - May 27 , 2024 | 12:31 AM
తిరుపతి కేటీరోడ్డులోని ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల హెల్ప్‌లైన్ కేంద్రంలో సోమవారం నుంచి వచ్చేనెల 3వతేదీ వరకు పాలిసెట్-2కే24 కౌన్సెలింగ్‌కు సంబంధించిన ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభం కానుందని ప్రిన్సిపాల్, కోఆర్డినేటర్ డాక్టర్ వై.ద్వారకనాథరెడ్డి తెలిపారు.
ఎస్వీ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ ద్వారకనాథరెడ్డి
తిరుపతి(విద్య), మే 26: తిరుపతి కేటీరోడ్డులోని ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల హెల్ప్‌లైన్ కేంద్రంలో సోమవారం నుంచి వచ్చేనెల 3వతేదీ వరకు పాలిసెట్-2కే24 కౌన్సెలింగ్‌కు సంబంధించిన ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభం కానుందని ప్రిన్సిపాల్, కోఆర్డినేటర్ డాక్టర్ వై.ద్వారకనాథరెడ్డి తెలిపారు. పాలిసెట్‌లో అర్హత సాధించిన విద్యార్థులు ఆన్‌లైన్‌లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి.. ర్యాంకులవారీగా ఆయా తేదీల్లో సర్టిఫికెట్లు వెరిఫై చేసుకోవాలని సూచించారు. సోమవారం.. ఒకటి నుంచి 12వేల ర్యాంకుల వరకు, మంగళవారం.. 12,001 - 27,000వరకు, బుధవారం.. 27,001 - 43,000వరకు, గురువారం.. 43,001 - 59,000వరకు, శుక్రవారం.. 59,001 - 75,000వరకు, జూన్1న 75,001 - 92,000వరకు, 2న 92,001 - 108000వరకు, 3న 108001 - చివరిర్యాంకు వరకు విద్యార్థులు హాజరు కావాలన్నారు. ఇందుకోసం.. ప్రాసెసింగ్ ఫీజు పేమెంట్ రిసిప్ట్, పాలిసెట్ హాల్‌టికెట్, ర్యాంకు కార్డు, టెన్త్/ఈక్వలెంట్ మార్కుల జాబితా, 4నుంచి పదో తరగతివరకు స్టడీ సర్టిఫికెట్స్, కుల ధ్రువీకరణపత్రం (బీసీ, ఎస్సీ, ఎస్టీ), ఆదాయ ధ్రువీకరణపత్రం, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్, టీసీ ఒరిజనల్‌తోపాటు రెండుసెట్ల జెరాక్స్ కాపీలను వెంట తెచ్చుకోవాలని పేర్కొన్నారు. స్పెషల్ కేటగిరీ విద్యార్థులు (పీహెచ్, సీఏపీ, ఎన్‌సీసీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్) విజయవాడలోని గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించే కౌన్సెలింగ్‌కి హాజరై, తమ ధ్రువపత్రాలను పరిశీలన చేసుకోవాలని, ప్రాసెసింగ్ ఫీజును జ్ట్టిఞట://్చఞఞౌజూడఛ్ఛ్టి.ుఽజీఛి.జీుఽ ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించాలన్నారు.