పైపులైన ధ్వంసం
ABN , Publish Date - Jun 03 , 2024 | 12:16 AM
కనగానపల్లి మండలంలోని మామిళ్లపల్లిలోని దోబీఘాట్‌కు నీటిని సరఫరా చేసే పైపులైనను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయంలో మాజీ మంత్రి పరిటాల సునీత రజకుల కోసం గ్రామ శివారులోని తలిపిరి వద్ద రూ.7 లక్షలతో దోబీఘాట్ నిర్మించారు.
ధర్మవరంరూరల్, జూన 2: కనగానపల్లి మండలంలోని మామిళ్లపల్లిలోని దోబీఘాట్‌కు నీటిని సరఫరా చేసే పైపులైనను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయంలో మాజీ మంత్రి పరిటాల సునీత రజకుల కోసం గ్రామ శివారులోని తలిపిరి వద్ద రూ.7 లక్షలతో దోబీఘాట్ నిర్మించారు.
నీటి వసతి కోసం బోరు వేయించి.. పైప్‌లైనను ఏర్పాటు చేశారు. ఆదివారం ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు ఆ పైపులను ధ్వంసం చేసినట్లు తెలిపారు. దీంతో తాము జీవనాధారం కోల్పోయినట్లు అయిందని రజకులు వాపోతున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో రజకులు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఓట్లు వేయడంతోనే వైసీపీ వర్గీయులు వాటిని ధ్వంసం చేసినట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.