Share News

నిర్లక్ష్యపు నీడలో నార్నెపాడు శాసనం

ABN , Publish Date - Jul 08 , 2024 | 01:03 AM

పల్నాడు జిల్లా, ముప్పాళ్ల మండం, నార్నెపాడు భీమేశ్వ రాలయం బయట క్రీ.శ 12వ శతాబ్ది శాసనం నిర్లక్ష్యానికి గురవడంపై పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్‌ ఇండియా ఫౌండేషన్‌ సీఈవో డాక్టర్‌ ఈమని శివనాగిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

నిర్లక్ష్యపు నీడలో నార్నెపాడు శాసనం
నార్నెపాడు శాసనాన్ని పరిశీలిస్తున్న ఈమని శివనాగిరెడ్డి

శాసనాన్ని భద్రపరచాలంటున్న పురావస్తు పరిశోధకుడు డాక్టర్‌ ఈమని శివనాగిరెడ్డి

విజయవాడ కల్చరల్‌, జూలై 7: పల్నాడు జిల్లా, ముప్పాళ్ల మండం, నార్నెపాడు భీమేశ్వ రాలయం బయట క్రీ.శ 12వ శతాబ్ది శాసనం నిర్లక్ష్యానికి గురవడంపై పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్‌ ఇండియా ఫౌండేషన్‌ సీఈవో డాక్టర్‌ ఈమని శివనాగిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. చరిత్ర అభిమానులు మణిమేల శివశంకర్‌, స్వర్ణ చినరామి రెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు ఆయన ఆదివారం ఈ శాసనాన్ని పరి శీలించారు. ఆలయ జీర్ణోద్ధరణ సందర్భంగా ఈ శాసనాన్ని రోడ్డుపై పడే శారని, కింద పీఠం, పైన శాసన రాయి, దానిపైన నంది, విగ్రహం అల నాటి శాసన విధానాన్ని తెలియజేస్తుందని తెలిపారు. శాసనరాయిపై క్రీ.శ 1151 నాటివి రెండు, క్రీ.శ 1198 నాటిది ఒకటి, క్రీ.శ 12వ శతాబ్ది తేదీ లేనివి రెండు, క్రీ.శ 1266 నాటిది ఒకటి కలిపి మొత్తం ఆరు శాస నాలున్నాయని తెలిపారు. వీటిని 1933లో నకళ్లు తీశారన్నారు. ఇటీవల కేంద్ర పురావస్తుశాఖ, శాసన విభాగ సంచాలకుడు, డాక్టర్‌ కె.మునిర త్నంరెడ్డి ప్రచురించారని పేర్కొన్నారు. శ్రీనారాయణపాడు అని శాసనం లో పేర్కొన్న నార్నెపాడులో క్రీ.శ 1151 శాసనాల్లో వొరిగొండ పోలనా మాత్యుడు, మందాడి కొమ్మినామాత్యుడు, క్రీ.శ 1198 శాసనంలో వల్లూరి నామనాయకుడు స్థానిక సోమేశ్వర (సోమనాథ), కేశవస్వామి అఖండ దీపాలకు గొఱ్ఱెల్ని దానం చేసినవి, గ్రామంలోని సోమనాథాల యంలో మండెపూడి సూరమనాయుడు నందిని ప్రతిష్టించిన వివరాలు ఉన్నాయని తెలిపారు. క్రీ.శ 12 శతాబ్దినాటి వెలనాటి రాజేంద్రుని శాస నంలో బాపట్ల సమీపంలోని చందోలు నుంచి పాలిస్తున్న రెండో గొంక రాజు, ఆయన భార్య ప్రోలాంబిక, మంత్రి కొమ్మనామాత్యులు, రెమ్మన అనే కమ్మ దేశాధిపతి ప్రస్థావనలు ఉన్నాయని తెలిపారు. అదే గ్రామం లో ద్రోణ (దొర) సముద్రమనే చెరువును తవ్వించిన వివరాలున్నాయని తెలిపారు. కమ్మదేశాన్ని (కమ్మనాడు) ప్రస్తావిస్తున్న చారిత్రక ప్రాధా న్యం గల 800 ఏళ్లనాటి ఈ శాసనాన్ని ఆలయంలోకి తరలించి, యథావి ధిగా నిలబెట్టి కాపాడుకోవాలని గ్రామస్థులకు సూచించారు.

Updated Date - Jul 08 , 2024 | 01:03 AM