Share News

కొంప కొల్లేరైంది... బెజవాడ బుడమేరైంది

ABN , Publish Date - Sep 05 , 2024 | 03:44 AM

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు, వరదలకు కొంప కోల్లేరైంది. బెజవాడ బుడమేరైంది్‌ అని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.

కొంప కొల్లేరైంది...  బెజవాడ బుడమేరైంది

జాతీయ విపత్తుగా ప్రకటించండి

ప్రధాని మోదీకి ఏపీసీసీ చీఫ్‌ విజ్ఞప్తి

చంద్రబాబు సహాయక చర్యలు బాగున్నా...

క్షేత్ర స్థాయికి చేరడం లేదు: వైఎస్‌ షర్మిల

అమరావతి, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): ఇటీవల కురిసిన భారీ వర్షాలకు, వరదలకు కొంప కోల్లేరైంది. బెజవాడ బుడమేరైంది్‌ అని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం కడప నుంచి విజయవాడ వచ్చిన ఆమె సింగ్‌నగర్‌ ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. బాధితులను పరామర్శించారు. మీడియాతో మాట్లాడారు. ువరదలతో బెజవాడ వాసులకు భారీ నష్టం జరిగింది. పలువురు ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నష్టపోయా రు. జరిగిన ఆపార నష్టాన్ని కేంద్రం గుర్తించాలి. జాతీయ విపత్తుగా ప్రకటించి, ఉదారంగా సాయం అందించాలని ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేస్తున్నా. దెబ్బతిన్న ప్రతి ఇంటికీ రూ.లక్ష, వస్తువులు కోల్పోయినవారికి రూ.50,000 కనిష్ఠంగా చెల్లించాలి. ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షలు పరిహారం ఇవ్వాలి. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25,000 చెల్లించాలి. సీఎం చంద్రబాబు చేపట్టిన సహాయక చర్యలు బాగున్నాయి. కాని అవి క్షేత్రస్థాయికి చేరడం లేదు. ఆక్రమణల కారణంగా బుడమేరు మూసుకుపోయింది. తెలంగాణ హైడ్రా మాదిరి రాష్ట్రంలోనూ ఆక్రమణలపై ఉక్కుపాదం మోపాలి్‌ అని షర్మిల డిమాండ్‌ చేశారు. కాగా, ప్రకాశం బ్యారేజీలోకి కావాలనే ఎవరో పడవలు వదిలారని వైఎస్‌ షర్మిల ఆరోపించారు. బ్యారేజీ వద్ద కృష్ణమ్మ వరద ఉధృతిని పరిశీలించారు. ుపడవలను కావాలనే వదిలినట్లుగా అనిపిస్తోంది. ఈ కుట్ర ప్ర ణాళిక సామాన్యమైనది కాదు. దీనికి బాధ్యులను గుర్తించా లి. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. జగన్‌ హయాంలో బ్యారేజీలు, ప్రాజెక్టులకు నిర్వహణ లేదు్‌ అని ఆక్షేపించారు.

Updated Date - Sep 05 , 2024 | 03:44 AM