Share News

రైతు వ్యతిరేక విధానాలు మానుకోవాలి

ABN , Publish Date - Aug 10 , 2024 | 01:26 AM

కేంద్ర ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక విధానాలను మాను కోవాలని కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు టీవీ లక్ష్మణస్వామి అన్నారు. స్థానిక గాంధీబొమ్మ సెంటర్‌లో సేవ్‌ ఇండి యా-సేవ్‌ అగ్రికల్చర్‌ అంటూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన తెలిపారు.

  రైతు వ్యతిరేక విధానాలు మానుకోవాలి
గన్నవరంలో నిరసన తెలుపుతున్న ప్రజా సంఘాల నాయకులు

గన్నవరం, ఆగస్టు 9 : కేంద్ర ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక విధానాలను మాను కోవాలని కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు టీవీ లక్ష్మణస్వామి అన్నారు. స్థానిక గాంధీబొమ్మ సెంటర్‌లో సేవ్‌ ఇండి యా-సేవ్‌ అగ్రికల్చర్‌ అంటూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా లక్ష్మణస్వామి మాట్లాడు తూ, మోదీ విధానాల వల్ల వ్యవసాయరంగానికి తీరని నష్టం కలుగు తుం దన్నారు. రైతులను నిలువున ముంచేశారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. సీఐటీయూ జిల్లా నాయకుడు కళ్లం వెంకటేశ్వరావు మాట్లాడుతూ, కార్మికులను బీజేపీ ప్రభుత్వం తీవ్ర మోసం చేసిందన్నారు. ప్రజా సంఘాల నాయకులు వై.నరసింహారావు, మల్లంపల్లి ఆంజనేయులు, సూరగాని సాంబశివరావు, ఆవుటపల్లి సాంబయ్య, మిరపా నాగేశ్వరరావు, చెరువు గట్టు ప్రసాద్‌, మాదిరెడ్డి చిన్న పాల్గొన్నారు.

ఉంగుటూరు : క్విట్‌ ఇండియా ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని కేంద్రంలో ప్రధాని మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ వ్యతిరేక విధానాలపై ప్రజలందరూ ఉద్యమించాలని కౌలురైతుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు టీవీ లక్ష్మణస్వామి పిలుపునిచ్చారు. కౌలు, వ్యవసాయ కార్మిక, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం క్విట్‌ కార్పొరేట్‌ అనే నినాదంతో ఉంగుటూరు సెంటర్లో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు అజ్మీర్‌ వెంకటేశ్వరరావు, కడవకొల్లు రామరాజు, మా తంగి సంతోష్‌కుమార్‌, భీమవరపు సుబ్బారెడ్డి, మాగంటి సాంబశివరావు, వాసు, విష్ణు, మీరావలి కే.బికారి, సలీం, పులి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

బుద్ధదేవ్‌ భట్టాచారికి నివాళి..

పశ్చిమబెంగాల్‌ మాజీ ముఖ్యమంత్రి కామ్రేడ్‌ బుద్ధదేవ్‌ భట్టాచారి అకాలమరణానికి చింతిస్తూ ఉంగుటూరులోని కామ్రేడ్‌ మానికొండ సూర్యావతి శ్రామిక భవనంలో సీపీఎం నాయకులు ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా భట్టాచారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

ఉయ్యూరు : రైతులు, కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని సీఐటీయు నాయకుడు పడాల లక్ష్మణరావు అన్నారు. రైతులు, కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం ఉయ్యూరు సెంటర్‌లో ప్రదర్శన చేశారు. రైతులు పం డిస్తున్న పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, కార్మికు లకు సంక్షేమ బోర్డు ద్వారా ఫలాలు అందించాలని డిమాండ్‌ చేశారు. రైతు సం ఘం నాయకులు అన్నే సుబ్బారావు, సీఐటీయు నాయకుడు బి.రాజేశ్‌, మహిళా సంఘం నాయకురాలు బి. కీర్తి, తిరుపతయ్య, తిరువీధుల రమేశ్‌, షరీఫ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 10 , 2024 | 01:26 AM