గత అనుభవాల దృష్ట్యా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అధికారులు నిర్లక్ష్య వైఖరితో ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆరోగ్యం మరోసారి ప్రమాదంలో పడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
నూజివీడు నియోజకవర్గం జూదాలకు అడ్డాగా మారుతుండడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. నియోజకవర్గంలో ప్రతి మండలంలోను యథేచ్చగా జూదాలు (పేకాట, కోడిపందేలు) జరుగుతున్నాయి.
అర్ధరాత్రి నడిరోడ్డుపై మందుబాబులు నానా హంగామా చేశారు. ఏకంగా కానిస్టేబుళ్లపైనే దాడికి పాల్పడ్డారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఈ ఘటన జరిగింది.
జిల్లాలోని సముద్రతీర ప్రాంతంలో అతిథి గృహాల వేది కగా రేవ్ పార్టీలు జోరందుకున్నాయి. యువతను ఆకర్షిం చేందుకు ఇతర ప్రాంతాల నుంచి యువతులను రప్పించి అర్ధరాత్రి చిందులు వేస్తున్నారు.
వందేమాతరం దేశ భక్తి యొక్క నినాదం మాత్రమే కాదు. అది మన మనసుల్లో దేశ మంటే ఏమిటో గుర్తు చేసే శక్తి’ అని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.
స్టాంప్స్ అండ్ రిజిస్ర్టేషన్ శాఖలో ప్రభుత్వం ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చినా దళారులదే ఇంకా పైచేయిగా నిలుస్తోంది. స్లాట్ బుకింగ్, అర్బన్ మ్యుటేషన్ సులభతరం చేయడం, కార్డు 2.0 సాఫ్ట్‌వేర్ అందుబాటులోకి తీసు కొచ్చినా ఇంకా సిబ్బంది, బయట వ్యక్తులతో లాలూచీలతో లావా దేవీలు సాగుతుండడం గమనార్హం.
వ్యవసాయ భూమిలో వేసిన బోర్‌వె ల్‌కు ఎలక్ర్టికల్ కనెక్షన్ ఇవ్వడానికి లైన్‌మన్ రూ.ఐదు వేలు లంచం తీసుకున్నట్టు నేరం రుజువు కావడంతో అతనికి ఏడాది జైలు శిక్ష, రూ.రెండు వేలు జరిమానా విధిస్తూ రాజమహేంద్రవరం ఏసీబీ ప్రత్యేక న్యాయ స్థానం శుక్రవారం తీర్పుచెప్పింది.
జిల్లాలో ప్రైవేట్ ఆలయాల నిర్వహణ, భద్రతపై దేవదాయ, ధర్మదాయశాఖ అధికారులు ఆరా తీస్తు న్నారు. ఇటీవల శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వ రస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో తొమ్మిది మంది దుర్మరణం చెందిన విషయం విదితమే.
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందించే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పరిస్థితిపై జిల్లా యంత్రాంగం మూకుమ్మడి ఆకస్మిక తనిఖీలు చేపట్టింది.
తుఫాన్ దెబ్బ రైతులకు చుక్కలు చూపిస్తోంది. ఎకరా వరికోతకు రూ.9 వేలు ఖర్చవుతోంది.