Share News

భూ హక్కుల పరిరక్షణకు చర్యలు

ABN , Publish Date - Feb 03 , 2026 | 12:23 AM

భూహక్కుల పరి రక్షణకు రాజముద్రతో పట్టాదారు పాస్‌ పుస్తకాలను ఇస్తున్నా మని, రైతులు, ప్రజల హక్కులను గౌరవిస్తూ వారికి భరోసా కల్పించడమే సుపరిపాలన లక్ష్యమని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థ సారథి అన్నారు.

భూ హక్కుల పరిరక్షణకు చర్యలు
కొర్లకుంటలో రైతులకు రాజముద్రతో పాస్‌ పుస్తకాలను పంపిణీ చేస్తున్న మంత్రి పార్థసారథి

మంత్రి కొలుసు పార్థసారథి

ముసునూరు, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): భూహక్కుల పరి రక్షణకు రాజముద్రతో పట్టాదారు పాస్‌ పుస్తకాలను ఇస్తున్నా మని, రైతులు, ప్రజల హక్కులను గౌరవిస్తూ వారికి భరోసా కల్పించడమే సుపరిపాలన లక్ష్యమని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థ సారథి అన్నారు. కొర్లకుంట గ్రామ సచివాలయం వద్ద సోమ వారం మీ భూమి – మీ హక్కు కార్యక్రమంలో భాగంగా రాజముద్రతో కూడిన పాస్‌ పుస్తకాలను మంత్రి రైతులకు పంపిణీ చేశారు. సభలో ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం జగన్‌ ఫొటోను ముద్రించుకుని పాస్‌ పుస్తకాలు అందించారని, దీనికి రూ.22 కోట్లు తగలేశారన్నారు. గ్రామం లో 693 మందికి పాసుపుస్తకాలు ఉండగా, రీ సర్వే చేసి, తొలి విడతగా 436 మందికి పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. అక్రమ రిజిస్ట్రేషన్లు చేసిన అధి కారులు, చేయించుకున్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. సబ్‌ కలెక్టర్‌ వినూత్న, తహసీల్దార్‌ ప్రశాంతి, ఇన్‌చార్జ్‌ ఎంపీడీవో వసంత వాణి ప్రసాద్‌, సర్పంచ్‌ సత్యనారాయణ, పాల్గొన్నారు.

Updated Date - Feb 03 , 2026 | 12:23 AM